తెలుగు రాష్ట్రాల్లో కాదు చెన్నైలో సైతం నటి శ్రీరెడ్డి కి ఎంత పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హాట్ బ్యూటీ కొద్ది రోజులుగా చెన్నైలో ఉంటున్న విషయం తెలిసిందే.  ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కరాటే కళ్యాన్, కొరియో గ్రాఫర్ రాకేష్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  శ్రీరెడ్డి, కరాటే కళ్యాని, డ్యాన్స్ మాస్టర్ రాకేష్ లు ఈ మద్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. తమపై శ్రీరెడ్డి పిచ్చి వాఖ్యలు చేసి బండబూతులు తిట్టిందని తమ మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిందని శ్రీరెడ్డిపై కరాటే కళ్యాని, రాకేష్ లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

 

అయితే చెన్నైలో నిన్న పోలీస్ కమీషనర్ కి తన ప్రాణాలకు ఈ ఇద్దరి వల్ల హాని ఉందని శ్రీరెడ్డి ఫిర్యాదు చేసింది.  ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు.  తాజాగా శ్రీరెడ్డి మాట్లాడుతూ.. పాపులారిటీ కోసం నాపై బురదజల్లేందుకు చూస్తున్నారు. పాపులారిటీ అంటే నేనేదో పెద్ద సెలబ్రిటీ అనో అందగత్తెననో కాదు.  అలా నేను ఎప్పుడూ అనుకోనూ లేదు.. నేను కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని అందరికోసం గలమెత్తాను.. అదే నే చేసిన తప్పా? నేను ఎవరికీ భయపడను అన్నారు.

 

ఇక నాకు జగన్ అన్న అంటే నిజంగానే ఇష్టం ఈ మాటలు నేను భవిష్యత్ రాజకీయాల గురించి మాట్లాడటం లేదు..నిజంగా నేను ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఆదరించి అన్నం పెట్టింది సాక్షి సంస్థ. సాక్షిలో పనిచేస్తున్నవారిలో చాలా మంది నన్ను ఎంకరేజ్ చేసారు. నేను కష్టపడి సాక్షిలో కెరీర్‌ ఏర్పరచుకున్నాను.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి వచ్చి ఆగమైపోయాను అన్నారు. కానీ ఎక్కడైనా మంచివాళ్లతో పాటు చెడ్డవాళ్లు కూడా ఉంటారు కదా. అలాగే నాకు ఇండస్ట్రీలో చెడ్డవాళ్లు తగిలారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: