దుల్కర్ సల్మాన్ ప్ర‌ముఖ మ‌ళ‌యాళ స్టార్ ముమ్ముట్టి కుమారుడు. మ‌ళ‌యాళంలో తండ్రి వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని స్టార్ హీరోయిన దుల్క‌ర్ స‌ల్మాన్ ఇక్క‌డ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా మ‌హానటి సినిమాతో సుప‌రిచితుడు అయిపోయాడు. ఆ సినిమాలో మ‌హాన‌టి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన దుల్క‌ర్ న‌ట‌న‌కు తెలుగు ప్రేక్ష‌కులే కాదు ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వ‌ర‌కు ప్రేక్ష‌కులు బ్రహ్మ‌రథం ప‌ట్టారు. ఇక తాజాగా దుల్క‌ర్ స‌ల్మాన్ - రీతూవ‌ర్మ జంట‌గా న‌టించిన సినిమా క‌నులు క‌నుల‌ను దోచాయంటే.



దర్శకుడు దేసింగ్ పెరియస్వామి తెరక్కించిన కనులు కనులను దోచాయంటే ఈ రోజు తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైంది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కు మంచి క్లాసిక్ మూవీ అన్న టాక్ వ‌చ్చింది. ఈ సినిమా క‌థ‌లోకి వెళితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సిద్దార్థ (దుల్కర్ ), కలీస్ (రక్షణ్) ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ హ్యాపీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. వీరు ఎవ‌రో తెలుసు కునేందుకు పోలీస్ ఆఫీర్ ప్రతాప్ సింహ (గౌతమ్ మీనన్) ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఓ పెద్ద దొంగతనం తరువాత సిధార్థ, కలీస్ తాము ప్రేమించిన మీరా (రీతూ వర్మ) సూర్య కాంతం(నిరంజని) తో కలిసి గోవా వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని ప్లాన్ వేస్తారు.



అయితే వీరు గోవా వెళ్లాక వీరిని ప్ర‌తాప్ సింహా ప‌ట్టుకుంటాడు. పోలీసుల చేతికి చిక్కిన ఈ ఇద్ద‌రు ఆ త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొన్నారు ?  మ‌రి వీరిద్ద‌రి స్నేహితురాళ్లు ఏ మ‌య్యారు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా. ఇక సినిమా రిజ‌ల్ట్ విష‌యానికి వ‌స్తే లవ్ అండ్ క్రైమ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా సమకాలీన హైటెక్ మోసాలను ప్రస్తావిస్తూ లవ్ ఎమోషన్స్ ని మిక్స్ చేసి తీశారు. క‌థ‌నం కొత్త‌గానే ఉంటుంది. ఇక ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా సాగిన ఈ క్రైం కామెడీ ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌ర‌చ‌ద‌నే చెప్పాలి. సెకండాఫ్‌, క్లైమాక్స్ ఇంకా బాగా డిజైన్ చేసుకుని ఉంటే సినిమా రేంజ్ వేరుగా ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: