ఒకే ఒక్క సినిమాతో దేశాన్ని ఊపేసింది ఆ హీరోయిన్. ఆ ఒక్క సినిమాతోనే ఆమె నేషనల్ వైడ్‌గా తిరుగులేని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమెకు అనుకున్న రేంజ్‌లో సినిమా ఛాన్సులు రాలేదు. అయితే ఆ సినిమా వచ్చి మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఆమెను మాత్రం ప్రేక్షకులు ఎప్పటకీ మర్చిపోలేరు. ఆ తర్వాత ఆమె తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. అయితే ఇప్పుడు సడెన్‌గా ఆమె తన భర్త నుంచి విడిపోయినట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.
ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ప్రేమ పావురాలు సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. హిందీలో తెరకెక్కి రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమా హిట్ అయ్యింది. ఆ టైంలో బాలీవుడ్లో వరుసగా ఛాన్సులు వస్తోన్న టైంలోనే ఆమె ఎవ్వరూ ఊహించని విధంగా ప్రేమ పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది.
తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త, నటుడు అయిన హిమాలయా దస్సానీని ప్రేమించిన ఆమె అప్పట్లో ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుని పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. ఇక కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్సింగ్ స్టార్ట్ చేసింది. ఆమె సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేయడం వెనక భర్తతో విడిపోవడమే అన్న టాక్ వచ్చింది. అయితే దీనిపై ఆమె అఫీషియల్‌గా చెప్పేసింది. నాకు తొలిసారిగా ప్రేమ చిగురించింది హిమాలయా పైనే.ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడాను కూడా.
అయితే అతడితో విడిపోవడం చాలా బాధగా ఉందని చెప్పింది. నా మసస్సు కుంగిపోయిన సంఘటనలు జరగడం వల్లే మేం విడిపోయామని..
ఇప్పటికి మేం విడిపోయి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది అని ఆమె చెప్పుకొచ్చింది.