టాలీవుడ్‌లో గత దశాబ్ద కాలంలో వచ్చిన అత్యుత్తమ కమెడియన్లలో వెన్నెల కిషోర్ ప్రస్థానం ప్రత్యేకమైంది. ఉన్నత విద్య అభ్యసించిన వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్... ఆ కామెడీ పంచ్‌లు.. ఆ డైలాగ్ డెలివరీ.. ఎక్స్‌ప్రెషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే కామెడీ జనరేట్ చేయడంలో తనకు తానే ప్రత్యేకమైన శైలీ అలవరుచుకున్నారు. ఈ తరహా కామెడీ మన తెలుగు ప్రేక్షకులుకు చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఎంతో మంది కమెడియన్లు ఉన్నా కూడా వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్ అవుతూ వచ్చింది.
ఇక ఫిబ్రవరి నెలలో వచ్చిన సినిమాలన్నింటిలోనూ భీష్మ మంచి కామెడీ ఎంటర్టైనర్‌గా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల అదిరిపోయే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడంతో పాటు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కడుపు చెక్కలయ్యేంత కామెడీని పంచాడు. ఈ కామెడీలో టోటల్ గా హీరో నితిన్ - కమెడియన్ వెన్నెల కిషోర్ ట్రాక్ బాగా హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తనదైన శైలిలో కామెడీతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాడు. రఘుబాబు అతడికి సహకరించాడు.
సంపత్.. బ్రహ్మాజీ.. నరేష్.. సుదర్శన్.. వీళ్లంతా వినోదం పంచడంలో తమ వంతు పాత్ర పోషించడంతో భీష్మలో కామెడీ అదిరిపోయింది. ఇక ఈ నెలలో రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో పాటు, శర్వానంద్ - సమంత జాను సినిమాలు కామెడీ సినిమాలు కాదు. ఇవి ఫీల్ గుడ్ నేపథ్యంలో తెరకెక్కాయి. ఇక నెల చివర్లో వచ్చిన విశ్వక్ సేన్ హిట్ సినిమా సైతం క్రైం జానర్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ అయ్యింది. దీంతో ఫిబ్రవరి నెలలో బెస్ట్ కమెడియన్ అవార్డు రేసులో వెన్నెల కిషోర్ కు పోటీయే లేదు. దీంతో వార్ వన్ సైడ్ కావడంతో వెన్నెల కిషోర్ హెరాల్డ్ బెస్ట్ కమెడియన్ అవార్డు FEB 2020 సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు సొంతం చేసుకున్న కిషోర్‌కు ఇండియా హెరాల్డ్ వసుధైక కుటుంబం తరపున అభినందనలు.