
సూపర్ స్టార్ అండ్ మెగా స్టార్ కలయిక అనగానే.. అభిమానులు అల్లంత ఎత్తున యెగిరి గంతేశారు. కానీ ఇపుడు ఈ వార్త విన్న అభిమానులకు, ముఖ్యంగా చిరు అభిమానులకు ఒకింత కష్టం కలగవచ్చు. అయితే ఇది నిజమని చెప్పలేం.. అలాగని అబద్ధమని చెప్పలేం. కానీ ఇపుడు ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి
అందరికి విదితమే.
ఈ సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా, జూన్ వరకు చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆగస్ట్‌లో సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే రిలీజు డేటు పైన అధికారికంగా ఎలాంటి వార్తలు రాలేదు. ఇక రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అదేమంటే, ఈ చిత్రంలో చిరుతో పాటు ఒక కీలక పాత్ర పోషించనున్న మహేష్, అరగంట నిడివి ఉన్న పాత్రలో నటించేందుకు ఏకంగా రూ. 30 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. టాప్ హీరోలుకు కూడా ఇంత రెమ్యునరేషన్ లేని పక్షంలో, మహేష్ కేవలం అరగంట పాత్ర కోసం ఇంత మొత్తం డిమాండ్ చేయడమేంటా అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
లోగుట్టు పెరుమాళ్ళ కెరుక గానీ, సదరు సూపర్ స్టార అభిమానులు మాత్రం, ఇదంతా బూటకమని, ఎవరు నమ్మవద్దని, ఇది కేవలం.. మెగా స్టార్ అండ్ సూపర్ స్టార్ అభిమానుల మధ్యన చిచ్చు పెట్టడానికి ఎవరో పన్నిన పన్నాగమని... ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, మా సూపర్ స్టార్ ఎంతో సున్నిత మనస్కుడని, అయన ఇలా డిమాండ్ చేయరని... సదరు అభిమానులు సోషల్ మీడియా వేదిక సాక్షిగా శపధాలు చేస్తున్నారు.