టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో మెగాస్టార్ అత్యద్భుత నటనకు మంచి పేరు దక్కింది. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన రేంజ్ లో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక దాని తరువాత తన తదుపరి సినిమా విషయమై కొంత గ్యాప్ తీసుకున్న మెగాస్టార్, ఇటీవల తన తదుపరి సినిమా అవకాశాన్ని దర్శకుడు కొరటాల శివకు అప్పగించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
మణిశర్మ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ఇటీవల పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ తో పాటు కొరటాలతో కూడా మంచి అనుబంధం గల మహేష్, సినిమాలో తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, ఆ పాత్ర యొక్క ఔచిత్యం నచ్చి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ బాలీవడ్ నటుడు సోను సూద్ ని ఎంపిక చేసింది సినిమా యూనిట్.
ఇక ఈ విషయమై నేడు ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సోను సూద్ మాట్లాడుతూ, తొలిసారిగా మెగాస్టార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాను, అంత గొప్ప నటుడి ప్రక్కన నటించే అవకాశం రావడం తన అదృష్టం అని చెప్పిన సోను సూద్, దర్శకుడు కొరటాల శివతో తనకు కొంత పరిచయం ఉందని, తప్పకుండా ఈ సినిమాలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చుతుందని సోను సూద్ మాట్లాడుతూ చెప్పారు. కాగా గతంలో పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన సోనూ సూద్ కు దూకుడు, ఆగడు, కందిరీగ, జులాయి సినిమాల్లో చేసిన విలన్ పాత్రలు మంచి పేరుని తీసుకువచ్చాయి......!!