టాలీవుడ్ సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పట్టుపని పది సినిమాలలో నటించలేదు కానీ... ఆమె పాపులారిటీ మాత్రం తారాస్థాయికి చేరుకుంది. అయితే ఆమెకు సంబంధించిన ఏ చిత్రమైనా నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్న అనగా ఫిబ్రవరి 28వ తారీఖున జాన్వీ కపూర్ ఒక మ్యాగజైన్ నిర్వహించిన గ్రాజియా వీకెండ్ 2020 కార్యక్రమంలో తళుక్కుమంది. అయితే ఈమె ఆ కార్యక్రమం యొక్క స్టేజిపైకి వస్తుండగా వీడియో గ్రాఫర్ లు ఆ క్షణాలను కెమెరాలో బంధించారు.

 

IHG

 

ఆ వీడియోలో జాన్వీ కపూర్ వైట్ అండ్ వైట్ అనగా తెలుపు పెప్లమ్ టాప్, తెలుపు పాంట్స్ ని ధరించి ఒక దేవకన్య లాగా కనిపించి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. తన జుట్టుని ఫ్రీగా వదిలేసి మెడలో ఒక తెలుపు హారం ధరించి బోల్డ్ గా తన ఎద భాగం చూపిస్తూ క్యాట్ వాక్ చేస్తూ కనిపిస్తున్న జాన్వీ కపూర్ ని చూస్తే ఏ యువకుడైన ఆమె పై మనసు పారేసుకుంటాడు. స్టేజి పైకి నడుచుకుంటూ వచ్చిన ఆమె మార్చి నెలకి సంబంధించిన మ్యాగజైన్ కవర్ ఫోటోని ప్రదర్శించింది. ఆ మ్యాగజైన్ కవర్ పై ఆమె ఫోటో ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


ఈ సందర్భంగా జాన్వికపూర్ మాట్లాడుతూ... ఈ మ్యాగజైన్ లాంచ్ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీతో ఒక ఫోటో షూట్ లో పాల్గొని నేను ఎంతో ఎంజాయ్ చేశాను. మీరు కూడా నా ఫోటో షూట్ తీసి ఎంజాయ్ చేసి ఉంటారని నేను ఆశిస్తున్నాను', అని చెప్పుకొచ్చింది. 

 


ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఆమె ఒక పూల ప్రింట్ చేసిన డ్రెస్స్ ధరించి జిమ్ కి అటెండ్ అయ్యి మళ్ళీ అందరి కనులను ఆమెవైపు తిప్పుకుంది. ఇకపోతే ఆమె గుంజన్ సక్సనా: కార్గిల్ గరల్, దోస్తానా 2 తదితర సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: