స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. నా పేరు సూర్య తర్వాత బన్ని కావాలనుకున్న సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా అందించింది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. పిరియాడికల్ డ్రామాగా రాబోతున్న సుకుమార్ సినిమా కూడా బన్ని కెరియర్ లో స్పెషల్ మూవీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఇదిలాఉంటే అల్లు అర్జున్ ఓ డైరక్టర్ సినిమాలో నటించాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నా సరే అతను మాత్రం బన్నిని లెక్క చేయట్లేదని తెలుస్తుంది. 

 

బన్నినే లెక్క చేయని ఆ డైరక్టర్ ఎవరంటే సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ అని అంటున్నారు. రైటర్ నుండి డైరక్టర్ గా మారిన కొరటాల శివ మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లు కొడుతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఓ స్పెషల్ క్యారక్టర్ రాసుకున్నాడు కొరటాల శివ. ఆ రోల్ లో ముందు రాం చరణ్ ఆ తర్వాత మహేష్ బాబు నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. మహేష్ నటించడం కన్ ఫాం అయినట్టే అని చెప్పుకుంటున్నారు.  

 

ఇంతకుముందే కొరటాల శివ డైరక్షన్ లో బన్ని సినిమా చేయాలని అనుకున్నాడు. డైరక్టర్ కు కూడా తన ఇంట్రెస్ట్ గురించి చెప్పాడట. అయితే కొరటాల శివ మాత్రం బన్నిని లైట్ తీసుకున్నాడని తెలుస్తుంది. చిరు సినిమాలో ఈ స్పెషల్ రోల్ కు బన్నిని తీసుకుంటారని అనుకోగా మహేష్ బాబు కోసం ప్రయత్నించారు. మరి అల్లు అర్జున్ కు ఆ పాత్ర సూట్ అవదని అనుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: