భానుమతీ రామకృష్ణ, ఈ పేరు ఇప్పటివారిలో కూడా చాలా మందికి సుపరిచితమే. ముందుగా కెరీర్ తొలి నాళ్లలో ఒక నటీమణిగా ఎంట్రీ ఇచ్చిన భానుమతి, ఆ తరువాత తన బహుముఖ ప్రజ్ఞతో తెలుగు ప్రజల నుండి విశేషమైన అభిమానాన్ని అందుకున్నారు. ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామానికి చెందిన భానుమతి మొదటి నుండి సంగీతంతో పాటు నాట్యం వంటి ఇతర కళలలో కూడా ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె తండ్రి వెంకట సుబ్బయ్య స్వతహాగా శాస్త్రీయ సంగీతంలో మంచి పేరుగాంచిన వ్యక్తి కావడంతో ఆమెకు చిన్నప్పటి నుండే సంగీతంపై ఎంతో మక్కువ ఏర్పడింది. 

 

ఆ తరువాత పలు నాటకాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న భానుమతి, తొలిసారిగా తెలుగు సినిమా పరిశ్రమకు కాళింది అనే సినిమా ద్వారా నటిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత మాలతి మాధవం, ధర్మ పత్ని, భక్తి మాల తదితర సినిమాల్లో నటించారు. ఆపై వచ్చిన స్వర్గసీమ సినిమా ఆమెకు నటిగా మంచి గుర్తింపునిచ్చింది. ఇక ఆపై మంచి అవకాశాలతో దూసుకెళ్లిన భానుమతి, అనంతరం చక్రపాణి, లైలా మజ్ను, విప్రనారాయణ, మల్లీశ్వరి సినిమాలతో హీరోయిన్ గా తన స్థాయిని మరింత పెంచుకుంటూ ముందుకు సాగారు. ఇక ఓవైపు నటిస్తూనే మరొకవైపు సంగీత దర్శకురాలిగా, అలానే స్వయంగా తానే సినిమాల్లో తన పాటలు పాడుకునే వారు. ఆపై రచయితగా, దర్శకురాలిగా, స్టూడియో అధినేతగా, ఇలా పలు శాఖలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన ఆమెపై అప్పటి నటీనటులందరికీ ఎంతో గొప్ప గౌరవం ఉంది. 

 

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమె, అనర్గళంగా ప్రతి శాఖ లోనూ దూసుకెళ్తూ ఆడవారు మగవారికి ఏ మాత్రం తీసిపోరు, అన్నింటా ఆడవారు కూడా అసాధ్యాలను సుసాధ్యం చేయగలరని నిరూపించారు. అటువంటి గొప్ప వ్యక్తి అయిన ఆమెపై ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుంది. ఆ విధంగా ఎన్నో శాఖల్లో పరిణితి, గొప్ప ప్రజ్ఞా పాఠవాలు సంపాదించిన భానుమతి, యావత్ తెలుగు సినిమా చరిత్రలోని నటీమణులందరికీ ఆదర్శమూర్తి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇక 2003లో ఆమెను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: