టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సినిమాలలో రొమాన్స్ ఉండాలని కోరుకుంటారు.. అలా వాళ్ళు అనడానికి కారణం లేకపోలేదు..ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా పుణ్యమా అంటూ యవత అలాంటి సినిమాలకు మొగ్గు చూపడంతో అలాంటి సినిమాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. మన కర్మ ఏంటంటే కంటెంట్ లేకపోయినా ఆ సీన్లు ఎక్కువగా ఉండేలా దర్శక నిర్మాతలు సినిమాలను చూపిస్తున్నారు...
అసలు విషయానికొస్తే... సినిమాలా ద్వారా రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగు టాప్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
విజయ్ దేవరకొండ:
ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో అడుగెట్టి ఒక్క అడుగు అంటూ ఒక్క సినిమాతో క్రేజ్ సంపాదించుకున్నాడు. అలా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఈయన అర్జున్ రెడ్డి సినిమాలో చేసిన రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ హీరో రొమాంటిక్ హీరోగా అవతారం ఎత్తాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పడు అలాంటి సినిమాలకే గ్రీన్ ఇగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు.
కార్తికేయన్ :
రొమాన్స్ కే పిచ్చెక్కించిన సినిమా అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఆరెక్స్ 100 .. హీరో హీరోయిన్లు యువత ఇలా ఉండాలని అంటూ చూపించి యువతను ఆకట్టుకోవడంతో సినిమా కలెక్షన్లతో రచలేపింది. దీంతో సినిమా కన్నా ఎక్కువగా హీరోకి చేసిన రొమాన్స్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. దీంతో హీరో రొమాంటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత శృతి మించిన రొమాన్స్ సినిమాలాల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.
అల్లు అర్జున్ :
వాళ్ళిద్దరితో పోలిస్తే అల్లు అర్జున్ కాస్త తక్కువనే చెప్పాలి. సినిమాలలో తన స్టైల్, యాక్షన్ అన్నిటికన్నా ముఖ్యంగా డ్యాన్స్ వీటితో పేరు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పడు వరుస సినిమాలలో నటిస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నాడు.
చూసారుగా వీరందరూ చాలా మంచి రొమాంటిక్ హీరోలని ప్రజలు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు అదే పేరును కాపాడుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు..