
తెలుగు ఇండస్ట్రీలోకి పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ తర్వతా సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి ’ చిత్రంతో సంచలన విజయం అందుకున్నాడు. ఈ చిత్రం మొదట్లో బోల్డ్ కంటెంట్ అని రూమర్లు వచ్చినా.. థియేటర్లో చూసిన యూత్ మాత్రం ఈ చిత్రంలోనే లవ్ ఎఫెక్షన్ సీన్లకు పడిపోయారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో వచ్చిన గీతాగోవిందం తో మరో బంపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత టాక్సీవాలా ఇలా వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ దేవరకొండకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రౌడీ హీరో అంటూ యూత్ తో మంచి పేరు సంపాదించాడు విజయ్ దేవరకొండ.
అయితే ఈ మద్య కొంత మంది కేటుగాళ్లు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మినట్లు సెలబ్రెటీల పేర్లు చెప్పుకొని ఫెక్ అకౌంట్స్ ఓపెన్ చేసి అమ్మాయిలకు గాలం వేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ పేరుతో ఓ యువకుడు ఫేస్బుక్లో ఖాతా సృష్టించి అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. అయితే ఈ విషయం తన ఫ్యాన్స్ ద్వారా తెలుసుకున్న విజయ్ దేవరకొండ అతని రూట్లోనే వచ్చి మోసాన్ని మోసంతోనే కనిపెట్టాడు. తన స్నేహితుడితో అమ్మాయిలా ఆ మోసగాడితో చాటింగ్ చేయించాడు. నిజంగానే అతడు తన పేరు తో చీటింగ్ చేస్తున్నాడని గ్రహించాడు. దీంతో విజయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, విజయ్ దేవరకొండ పేరుతో చాలా కాలం నుంచి నకిలీ ఫేస్బుక్ ఖాతాతో ఓ యువకుడు అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ యువకుడు మొదట విజయ్ దేవరకొండ ఫేస్ బుక్ తో చాటింగ్ చేస్తూ.. నా డబ్బింగ్ ఆర్టిస్టుతో చాటింగ్ చేయండి' అంటూ తన అసలు ఫేస్బుక్ ఖాతాను అమ్మాయిలకు పంపిస్తున్నాడు. అంతే కాదు తన ఫోన్ నెంబర్ ఇచ్చి వారితో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి ప్రేమలో పడేసే ప్రయత్నం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పేరుతో కొంత మంది ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తూ మోసాలు చేస్తున్నారు.. అలాంటి వారి మోసాలకు పడిపోవొద్దని తన ఫ్యాన్స్ కి హితవు పలికారు విజయ్ దేవరకొండ.