తన మాజీ ప్రియుడు గురించి బాలీవుడ్ నటి సనా ఖాన్ ప్రస్తావిస్తూ.. రెచ్చిపోయారు. మెల్విన్ లూయీస్ ఒక వ్యక్తిత్వం లేని మగాడిని, ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటి సనా ఖాన్ విరుచుకు పడ్డారు. అతడి కారణంగా తనతో పాటు మరెంతో మంది అమ్మాయిలు శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు పొందిన మెల్విన్, సనా ఖాన్ చాలా సంవత్సరాలు ప్రేమలో మునిగితేలిన విషయం అందరికి విదితమే. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఒకరికి ఒకరు విడిపోయారు. ఈ నేపథ్యంలో సనా ఖాన్ బుధవారం సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ... మెల్విన్ గురించి, పై విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మెల్విన్ లూయీస్ గురించి ఇంకా ప్రస్తావిస్తూ.. 17 నుండి 18 ఏళ్ల అమ్మాయిలను కూడా ఆ నీచుడు వదిలిపెట్టలేదు. ఎంతో మందిని మోసం చేశాడు. ఈ విషయం గురించి నాకు ఓ అడ్వకేట్ చెప్పారు. ఓ పద్దెనిమిదేళ్ల యువతిని మెల్విన్ గర్భవతిని చేశాడని, ఆ తర్వాత తనకు దూరంగా ఉండటంతో సదరు యువతి డిప్రెషన్‌లోకి వెళ్లి నిండు జీవితాన్ని పాడుచేసుకుందని వ్యాఖ్యానించింది. అలాగే మరో అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి.. అత్యాచారం చేశాడని ఈ సందర్భంగా తీవ్రమైన ఆరోపణలు చేసింది.
ఇలా.. వారినే కాకుండా ఇంకా ఎంతో మందిని మెల్విన్ మానసిక, శారీరక వ్యథ అనుభవించేలా చేశాడని.. అయితే వాళ్లంతా మామ్మూలు మధ్యతరగతి అమ్మాయిలు కావడంతో అతడి నిజ స్వరూపం గురించి
ఎవరూ బయటపెట్టే సాహసం చేయలేదని చెప్పింది. బయట ఎంతో సంస్కారవంతుడిగా కనిపించే మెల్విన్ నిజంగా క్యారక్టర్ లేని నీచుడు అని సనాఖాన్ విరుచుకు పడింది. ఇక తనకు సంబంధించిన ప్రతీ విషయంలోనూ మెల్విన్ చాలా అతిగా స్పందించేవాడని సనాఖాన్ తెలిపారు. కానీ అతని వ్యక్తిత్వం తెలియక, మొదట్లో మోసపోయాననీ.. తరువాత వాడి నిజ స్వరూపం తెలిసి దూరంగా జరిగానని ఆవేదన చెందారు.