నిన్న అనగా బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తన మగ స్నేహితులతో పాటు ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ప్రిజమ్ (PRISM) క్లబ్ కు వెళ్ళాడు. అయితే అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రాహుల్ సిప్లిగంజ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి ఇంకా తన బంధువులు కలిసి బీరు సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎవరో ఒక వ్యక్తి ఓ బీరు సీసా ని రాహుల్ సిప్లిగంజ్ తలపై బలంగా మోదడంతో అతడి తలకు గాయం అయింది.

 

 

మరోవైపు దాడి గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చి రాహుల్ సిప్లిగంజ్ ని కాపాడారు. అనంతరం రాహుల్ సిప్లిగంజ్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తన తలకు తగిలిన గాయానికి చికిత్స చేయించుకొని వెంటనే డిశ్చార్జ్ అయ్యి... దాడి చేసిన వారిపై ఫిర్యాదు కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. దీంతో పోలీసులే పబ్లో జరిగిన దాడిని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




అయితే తాజాగా ఈ ఘటనపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ... తనపై ఎవరో ఒక యువకుడు బీరు సీసాతో దాడి చేశాడని, తన తలకి కేవలం చిన్న గాయం మాత్రమే అయిందని, అందుకుగాను చికిత్స చేయించుకున్నానని, అంతకుమించి ఏం కాలేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పుకొచ్చాడు.




ఇంతకీ ఈ దాడిలో తప్పు ఎవరిదనేది పోలీసులు తెలుసుకోవడానికి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ స్నేహితులు మాట్లాడుతూ... తమతో పాటు వచ్చిన ఒక అమ్మాయి పట్ల రితేష్ రెడ్డి వర్గంవారు అసభ్యంగా అనుచితంగా ప్రవర్తించడంతో రాహుల్ వారిపై మండిపడ్డాడని... దాంతో ఇరువురి మధ్య వాగ్వాదం అరగంటపాటు చోటుచేసుకుందని ఆ తర్వాత రితేష్ రెడ్డి బీరు సీసాతో దాడి చేశాడని చెబుతున్నారు.




మరోవైపు రితీష్ రెడ్డి మాట్లాడుతూ... రాహులే తమ ని వేధించాడని దాంతో తాము ఎదురు తిరిగామని అప్పుడే గొడవ ప్రారంభమైందని చెబుతున్నాడు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాహుల్ సిప్లిగంజ్... ఎటువంటి కేసు పెట్టకపోవడంతో అతనిదే తప్పు అయ్యి ఉండవచ్చని చాలామంది భావిస్తున్నారు. అలాగే రాహుల్ సిప్లిగంజ్ తో వచ్చిన ఆ స్నేహితురాలు బిగ్ బాస్ పార్టిసిపెంట్ పునర్నవి భూపాలం కాకపోతే మరెవరు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనా పోలీసులు ఈ దాడి పై క్లారిటీ త్వరలోనే ఇవ్వనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: