జబర్దస్త్ షోలో ఈమధ్య బాగా పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. అదిరే అభి టీం నుండి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న ఆదికి అదృష్టం బాగా కలిసి వచ్చింది. రాజుతో కలిసి హైపర్ ఆది.. రైజింగ్ రాజు టీంలో అదరగొట్టే పంచులతో హంగామా చేస్తుంటారు. జబర్దస్త్ లో ఐదారు స్కిట్స్ ఉంటే అందరు ఎంజాయ్ చేసేది మాత్రం హైపర్ ఆది టీం చేసే కామేడీతోనే.. అందుకే కొద్దిరోజుల్లోనే చాలా ఫేమస్ అయ్యాడు. జబర్దస్త్ లోనే కాదు వేరే షోలు.. సినిమాలు అబ్బో కుర్రాడి హవా అలా కొనసాగుతుంది.
అయితే అందరి స్కిట్స్ లా కాకుండా బయట బర్నింగ్ ఇష్యూల మీద తన మార్క్ పంచులు వేసే హైపర్ ఆది.. తన టీం లో పత్తి వ్యాపారం బ్యాచ్ ఉందని తెలిసినా టీం లో స్థానం ఇచ్చాడు. అంతేకాదు తన టీం లో ఉన్న దొరబాబు, పరదేశిల మీద తానె పంచులు వేస్తూ ఉంటాడు. దొరబాబు యూ ట్యూబ్ వీడియోల గురించి ఎప్పుడూ ఆది పంచులు వేస్తూ ఉంటాడు. అదేదో గతం కదా అలా చేయకుండా ఉండేందుకు దొరబాబుని ఆది ఆడుకుంటున్నాడు అనుకున్నారు. కాని దొరబాబులో ఆ కళ ఇంకా పోలేదని తెలుస్తుంది. రీసెంట్ గా వైజాగ్ లో దొరబాబు, పరదేశిలు రెడ్ హ్యాండెడ్ గా ఒక వ్యభిచార గృహంలో పట్టుబడ్డారు.
తన టీం లో అలాంటి వాళ్ళని పెట్టుకుని బయట విషయాల పట్ల ఆది పంచులు వేయడం కామెడీ అని అంటున్నారు. దొరబాబు, పరదేశీలు ఇలాంటి వారని తెలిసినా ఆది టీం లో ఎందుకు ఉంచుకున్నాడు అంటూ ఆది ని ఎటాక్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి వల్ల ఆదికి తలనొప్పి తప్పదని చెప్పొచ్చు. ఈ విషయంపై ఆది ఎలా రెస్పాండ్ అవుతాడు అన్నది హాట్ న్యూస్ గా మారింది.