అక్కినేనివారి నటవారసుడు నాగచైతన్య హీరోగా మలయాళీ ముద్దుగుమ్మ సమంత రూత్ ప్రభు తొలిసారిగా టాలీవుడ్ కి పరిచయమైన సినిమామాయ చేసావే. కొన్నేళ్ల క్రితం తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘట్టమనేని మంజుల నిర్మించిన ఈ సినిమా అప్పట్లో అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు, హీరోయిన్ గా సమంత కు ఎంతో గొప్ప పేరు, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాతో అప్పటి యువతలో సమంతకు వచ్చిన క్రేజ్ అయితే అంతా ఇంతా కాదనే చెప్పాలి. 

 

ఆ తర్వాత కొన్నాళ్ళకు వీరిద్దరూ దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఆటోనగర్ సూర్య సినిమాలో రెండవ సారి కలిసి నటించారు. కాగా ఆ సినిమా కూడా మంచి సక్సెస్ ని సాధించింది. ఇక ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి వారిద్దరూ కలిసి నటించిన అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం కూడా సూపర్ హిట్ కొట్టింది. ఇక నాలుగవసారి వీరు కలిసి నటించిన మజిలీ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. హృద్యమైన ప్రేమకథతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమాని, దర్శకుడు శివ నిర్వాణ, ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. 

 

రిలీజ్ తర్వాత సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా అటు సమంతతో పాటు చైతన్యకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే వారిద్దరి వివాహం తరువాత నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. నిజ జీవితంలో భార్య భర్తలైన వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల పై ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ వుంది. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబోలో మరొక సినిమా ఏదైనా వస్తుందేమో చూడాలి. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే చైతు తన కెరీర్ పరంగా వరుసగా సినిమాలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంటే, మరోవైపు సమంత మాత్రం ఆచి తూచి మంచి కథాబలం ఉన్న సినిమాలలోనే నటించడానికి ఆసక్తి చూపుతున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: