1991 లో ‘కూలీ నెం.1’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ టబుని, కుర్రకారు అంతత్వరగా మర్చిపోవడం అసాధ్యం. ఆ తదుపరి సినిమా నాగార్జున (నిన్నే పెళ్లాడుతా) సినిమాతో తెలుగు వారికి టబు మరింత చేరువైంది. అప్పట్లో నాగార్జున అండ్ టబు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి కోకొల్లలుగా మాట్లాడుకునే వారు. హిందీ లో సూపర్ యాక్ట్రెస్ పేరు సంపాందించుకున్న అమ్మడుకి తెలుగు నాట కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.
 

IHG

 

ఇక ఇటీవల అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘అల..వైకుంఠపురములో..’ సినిమాతో తెలుగు తెరకు టబు, నిజమైన పండగ తీసుకొచ్చింది. ఇక ఆ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో మన అందరికి విదితమే. దాని తరువాత టబు తెలుగులో ఏ సినిమా చేస్తుందనే విషయం అభిమానుల్లో మాములుగానే నాటుకు పోయింది.

 

వాటన్నిటికి సమాధానంగా ఆమె నితిన్ సినిమాలో నటించబోతుంది అనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో గింగురులు కొడుతోంది. ఇక భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో నితిన్‌ ఫుల్ జోష్ లో వున్నాడట. టబు తో కలిసి నటించే సమయం కోసం ఆటను వెయిట్ చేస్తున్నాడని టాలీవుడ్ సహచరుల సమాచారం.

 

IHG

 

ఇక ఆ సినిమా ఏమిటంటే, హిందీలో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్‌.’ సదరు రీమేక్‌లో నితిన్‌ నటించనున్నాడు అనే సంగతి విదితమే. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమా ఒరిజినల్ లో టబు చాలా కీలక రోల్ చేసిందనే విషయం కూడా తెలిసినదే. ఇప్పుడు అదే రీమేక్ లో మరలా టబు నటించి, తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: