హీరోయిన్స్ కి బికినీ వేసుకోవటం కొత్త ఏమీ కాదు. సినిమాలో ఎక్స్‌పోజింగ్ కోసం వాటిని వేసుకోడం వారికీ అలవాటే ఎందుకంటే వారు ఉన్న ప్రొఫెషన్ అలాంటిది. ఆడపిల్ల తల్లిదండ్రుల ముందు సోదరుల ముందు కాస్త ఒళ్లు కనిపించినా సిగ్గుగా ఫీలవుతాం. అలాంటి ఈ హీరోయిన్ తన వాళ్ల ముందు బికినీ వేసుకొని దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.
ఆ హీరోయిన్ ఎవరో కాదండి బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్. ఆమె ఏకంగా తన అన్నయ్య ముందు బికినీ వేసుకుని మరీ హాట్ ఫొటోలు దిగింది. తన అన్న బర్త్‌డే సందర్భంగా ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. స్విమ్మింగ్ పూల్ లో సారా బికినీ వేసుకుని అన్నతో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ పోస్టర్ ను చూసిన నెటిజన్లు ఆమెపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
సారా ఒక ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. దాంతో ఆ మతానికి చెందిన వారు కూడా ఏకిపారేస్తున్నారు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి సిల్లీ రూల్స్ పాటించడమేంటి అంటూ మరికొందరు సారాకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారాకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఆలియా భట్, శ్రద్ధా కపూర్లు స్టార్ కిడ్సే అయినప్పటికీ ఇండస్ట్రీలో తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. కానీ సారా చేసింది రెండు సినిమాలే అయినా స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సినంత క్రేజ్ వచ్చేసింది. బాలీవుడ్ లో సారాకు తిరుగులేదనే చెప్పాలి. మొదటి సినిమా షూటింగ్ అవుతుండగానే వరుసగా మూడు సినిమాలకు సంతకం చేసేసింది. ఇప్పుడు సారా చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆమె యాక్టింగ్‌పై జనాలు నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నా.. తాను మాత్రం వరుసగా సినిమాలు చేసేస్తున్నారు.