సౌత్ స్టార్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన త్రిష ఇప్పటికి తమిళంలో మంచి ఫామ్ కొనసాగిస్తుంది. మధ్యలో కొన్నాళ్ళు కెరియర్ లో వెనుకపడ్డా 96 సినిమాతో త్రిష మళ్ళీ కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయ్యింది. ముదురు వయసులో కూడా అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్నిటికి ఓకే చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఇలాంటి టైం లో ఓ నిర్మాతకు మాత్రం తీవ్ర అన్యాయం చేసిందని తెలుస్తుంది. త్రిష తమిళంలో చేసిన సినిమా పరమపదమ్ విలయాట్టు. ఆ సినిమా ప్రమోషన్స్ కు ముందు త్రిష వస్తానని చెప్పగా తీరా ప్రమోషన్స్ టైం లో హ్యాండ్ ఇచ్చిందట.

 

ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ఆ సినిమా నిర్మాత త్రిష మీద కేసు వేయడానికి సిద్ధమయ్యాడు. సినిమాకు మాత్రమే కాదు ప్రమోషన్స్ కూడా సినిమాలో భాగమే.. అందుకు కూడా ఎక్స్ ట్రా ఎమౌంట్ వసూలు చేస్తారని. మరి అలాంటి టైం లో ప్రమోషన్స్ కు రాకుండా చేస్తే ఎలా కుదురుతుందని అంటున్నాడు ఆ నిర్మాత. త్రిష తప్పనిసరిగా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని. తన సినిమా ప్రమోషన్స్ టైం లోనే వేరే సినిమా ఓపెనింగ్ జరిగిందని. ఆ విషయాన్ని ముందే తనకు చెబితే ఈ ప్రమోషన్స్ పోస్ట్ పోన్ చేసుకునే వాడినని అంటున్నాడు పరమపదమ్ నిర్మాత.

 

త్రిష ప్రమోషన్స్ ఎగ్గొట్టిన విషయంపై ఆ నిర్మాత చాలా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఆమెకు తమిళ సినిమా అవకాశాలేమి రాకుండా చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. గొడవ పెద్దది చేయకుండా త్రిష ఆ నిర్మాతతో మాట్లాడి ఈ విషయాన్ని ఇంతటితో ఆపెయిస్తే బెటర్ లేదంటే ఆమె కెరియర్ కు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కెరియర్ సాఫీగా సాగుతుంది అనుకున్న టైం లో త్రిష చేసిన ఓ చిన్న పొరపాటు ఆమెను రిస్క్ లో పడేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: