సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ షో కి వెళ్లి ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలవడంతో ఈ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అయితే తాజాగా బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్లో జరిగిన ఎటాక్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన వికారాబాద్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రిషిక్ రెడ్డి తన ఫ్రెండ్స్ తో కలిసి గచ్చిబౌలిలోని ప్రిస్మ్ పబ్ కి వెళ్లగా... అదేరోజు రాహుల్ తన ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే రిషిక్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరగడంతో రాహుల్ సిప్లిగంజ్ పై బీర్ బాటిల్స్ తో దాడి చేశారు రిషిక్ రెడ్డి అతని ఫ్రెండ్స్.
ఇక మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు రాహుల్ సిప్లిగంజ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ సిప్లిగంజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ సిప్లిగంజ్ మీడియాతో మాట్లాడిన విధానం పై ప్రముఖ యాంకర్ బీజేపీ నేత శ్వేత రెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జరిగిన దాంట్లో రాహుల్ కూడా తప్పు ఉంది అంటూ శ్వేతా రెడ్డి అన్నారు. దాడి జరిగిన తర్వాత పబ్ కి ఎందుకు వెళ్లారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే మీరు వెళ్లర అంటూ రాహుల్ ఎదురు ప్రశ్న వేశాడు... రాహుల్ అలా మాట్లాడడం చాలా తప్పు అంటూ యాంకర్ శ్వేత రెడ్డి వ్యాఖ్యానించారు. సెలబ్రిటీ కాబట్టి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేయడం కరెక్ట్ కాదు అంటూ శ్వేత రెడ్డి తెలిపారు.
అయితే రాష్ట్రంలో ఉన్న పబ్బులు క్లబ్బుల కారణంగా యువత మొత్తం పెడదారి పడుతు పడుతుందని వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని క్లబ్బులు పబ్బులను నిషేధించాలంటూ కోరుతున్నాను అంటూ శ్వేతా రెడ్డి తెలిపారు.ఇదిలా ఉంటే తనపై దాడి జరిగిన వీడియో తో పాటు మరో వీడియోను కూడా రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తనతో మరో ముగ్గురు ఉంటే ఆ మజా వేరే ఉండేదని... తాను ఎవరిని గెలకనని కానీ తనను గెలికిన వాళ్ళను మాత్రం వదలను అంటూ రాహుల్ సిప్లిగంజ్ మరో వీడియో కూడా విడుదల మరింత చర్చనీయాంశంగా మారింది..