ఈమె ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బాగా చేశారు అనితా చౌదరి. తాను ఈటీవీలో ఓ ప్రోగ్రామ్ చేస్తున్నపుడు ఆమె పేరును అనిత అని కాకుండా.. అనితా చౌదరిగా వేసేసారట. చౌదరి అని తీయమని చెప్పిన వాళ్ళు వినిపించుకోకుండా అలానే ఉంచేశారు. దాంతో ఏమి అనలేక పోయానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇండస్ట్రీలో అనితా అనే పేరుగల వారు చాలా మంది ఉన్నారని దాంతో ఇక నేను ఏమి అనలేదని అన్నారు. దాంతో నేను అనితా చౌదరి అనే ఉంచేసుకున్నానని తెలిపారు.
అనితా చౌదరి.. ‘నువ్వే నువ్వే’, ‘సంతోషం’ లాంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే సినీ ఇండస్ట్రీలో మామూలు వారికంటే.. చౌదరీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్న విషయంపై అనిత మండిపడ్డారు. అక్కడ అంత సీనేమీ లేదని వాపోయారు. యాంకరింగ్ చేస్తున్నప్పుడు తన చేత కుక్క చాకిరీ చేయించుకున్నారనే షాకింగ్ విషయాలను ఆమె వెల్లడించారు.
అయితే.. కులం వల్ల మగవాళ్లకు ఏమన్నా లాభం కలిగిందేమో కానీ.. నాకు మాత్రం దానివల్ల ఎలాంటి లాభాలు కలగలేదని ఆమె అన్నారు. అయితే నాకు యాంకర్స్ సుమ, ఝాన్సీ, ఉదయభానులతో మంచి రిలేషన్స్ ఉన్నాయని తెలిపారు. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలతో కలిసి పనిచేసానని అన్నారు.
నాకు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉందని, అక్కినేని నాగేశ్వరరావుకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉందని ఆమె అన్నారు. నాపై తెగ నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలతో కలిసి పనిచేసాను వేసేవాళ్లు. ఆయన నటిస్తున్న ఓ సినిమాలో నేను నటిస్తుంటే.. ‘ఈ అమ్మాయిని నాకు మేనకోడలిగా పెట్టొచ్చు కదయ్యా’ అనేవారని తెలిపారు.