అల వైకుంఠపురములో సూపర్ డూపర్ హిట్ అవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తను చేస్తున్న సుకుమార్ సినిమాపై మరింత ఫోకస్ పెట్టాడు. సుకుమార్ తో ఆర్య, ఆర్య2 సినిమాలు చేసిన బన్ని ఈసారి ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. సుకుమార్, బన్ని మరో రంగస్థలం లాంటి సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా శేషాచలం అడవుల నేపథ్యంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కథతో వస్తుందట. సినిమాలో బన్ని లారీ డ్రైవర్ గా నటిస్తాడని తెలుస్తుంది. రాం చరణ్ చిట్టిబాబుగా ఇరగ్గొట్టాడు. బన్ని కూడా కెరియర్ లో ఎప్పుడు చేయని ఓ ఊర మాస్ పాత్ర చేస్తున్నాడు.

 

అయితే ఈ సినిమా పాత్ర మాట తీరు డిఫరెంట్ గా ఉంటుందట. సినిమా సగానికి పైగా అడవిలో ఉంటుంది కాబట్టి రాయలసీమ యాస అది కూడా మాస్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ విషయంలో బన్ని ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నాడని అంటున్నారు. అరవింద సామెత వీర రాఘవ సినిమా కోసం రాయలసీమ యాసని పట్టేశాడు తారక్. అందుకే ఆ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్స్ తో పాటుగా తారక్ వాటిని పలికించిన విధానం కూడా సూపర్ గా ఉంటుంది.

 

ఇక ఇప్పుడు బన్ని కూడా అలానే చేస్తాడని తెలుస్తుంది. రాయలసీమ భాషనే తన మార్క్ తో చేబుతాడట. సినిమాలో బన్ని లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2021 మళ్ళీ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి సుకుమార్, బన్ని హ్యాట్రిక్ కాంబో ఎలాంటి సెన్సేషనల్ మూవీ అందిస్తారో చూడాలి. ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులకు గురి పెట్టాడు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: