పవన్ కళ్యాణ్ టాప్ 5 సూపర్ హిట్ సినిమాల లిస్టును తయారుచేయాలి అంటే ‘తొలిప్రేమ’ సినిమా ప్రస్తావన లేకుండా పవన్ ఇప్పటి వరకు నటించిన 25 సినిమాల లిస్టు పూర్తి కాదు. పవన్ కెరియర్ కు సంబంధించి చాల తొలి రోజులలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బష్టర్ హిట్ కావడమే కాకుండా ఈ సినిమా టివి లో వస్తే చాలామంది చూస్తుంటారు.


మూవీ దర్శకుడు కరుణాకరన్ కు ఈ మూవీ చాల మంచి పేరు తెచ్చిపెడితే అప్పట్లో ఈ మూవీ తరువాత యూత్ కు ఐకాన్ గా పవన్ కళ్యాణ్ మారిపోయాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ అదే స్థాయి హిట్ ఇవ్వాలని ప్రయత్నంచేసి తీసిన ‘బాలు’ మూవీ ఫెయిల్ కావడంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాలేదు.  


అయితే ఈమధ్య తరుచూ కరుణాకరన్ పవన్ కళ్యాణ్ ఆఫీసులో కనిపిస్తూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. దీనితో పవన్ భవిష్యత్ లో చేయబోయే సినిమాల లిస్టులో కరుణాకరన్ మూవీ కూడ ఉందా అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. అయితే 50 సంవత్సరాల వయసుకు దగ్గర పడుతున్న పవన్ ఇప్పుడు యూత్ ఫుల్ లవ్ స్టోరీలు చేస్తే ఎవరు చూస్తారు అన్న సందేహాలు ఎవరికైనా వస్తాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు కరుణాకరన్ ఒక మంచి ప్రేమ కథ వ్రాసి ఈమధ్య పవన్ కు వినిపించడంతో ఈ ప్రేమ కథ తో తన పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ బ్యానర్ పై సాయి ధరమ్ తేజ్ తో కాని వైష్ణవ్ తేజ్ తో కానీ ఒక చిన్న సినిమా తీసే ఆలోచనలలో కరుణాకరన్ పవన్ కళ్యాణ్ ల మధ్య ప్రస్తుతం సీరియస్ చర్చలు జరుగుతున్నట్లు టాక్. ఒకవైపు సినిమాలు చేస్తూ మరొక వైపు నిర్మాతగా తన మెగా ఫ్యామిలీ లోని యంగ్ హీరోలతో వరసపెట్టి సినిమాలు చేసే ఆలోచనలలో ఉన్న పవన్ ను చూస్తుంటే పవన్ కు డబ్బు విలువ ఇప్పుడు బాగా తెలిసింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: