ఈ వారం లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేంటంటే... మధ, యురేకా, ప్రేమ పిపాసి, శివన్. ఐతే ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా టాప్ ప్లేస్ ని సంపాదించిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


మొదటిగా శివన్ సినిమా గురించి చెప్పుకుంటే... ఈ చిత్రంలో సాయి తేజ, తరుణి సింగ్ హీరోహీరోయిన్లగా నటించగా యువ దర్శకుడు శివన్ దర్శకత్వం వహించాడు. శివన్(సాయి తేజ) తన అమ్మని చిన్నప్పుడే కోల్పోతాడు. ఐతే సునంద(తరుణి సింగ్) శివన్ కి దగ్గరవుతుంది. క్రమక్రమంగా వారిద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. అంతలోనే సునంద తన కుటుంబ సభ్యులను కోల్పోయి అనాథ అవుతుంది. దాంతో సునంద బాధను పోగొట్టేందుకు శివన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇది విన్న సునంద సంతోషపడి ప్రేమకి అంగీకరిస్తుంది. అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి బయలుదేరుతున్నప్పుడు శివన్ మారిపోయి సునందని చంపేస్తాడు. ఐతే సాయితేజ సునందని ఎందుకు చంపాడు అనేది ఈ సినిమాలో చూపించబడింది. సినిమా కాన్సెప్టు చాలా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ వెండితెర పై రసవత్తరంగా చూపించలేకపోయాడు డైరెక్టర్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సోసో గా ఉండటం, చాలా బోరింగ్ సీన్స్ ఉండటం, ఫేక్ ఎమోషన్స్ అన్ని సినిమా అట్టర్ ఫ్లాప్ చేశాయని చెప్పుకోవచ్చు.

 



యురేకా: కార్తీక్ ఆనంద్, మున్నా హీరోలుగా నటించిన ఈ సినిమామర్డర్ మిస్టరీ పై సాగుతుంది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ మెచ్చుకోదగినవే కానీ మిగతా సినిమా మొత్తం చాలా చండాలంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపడం లేదు.

 




ప్రేమ పిపాసి: ఒక యంగ్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమ పిపాసి లో హీరో జిపిఎస్ నటన కొంతవరకు ఆకట్టుకుంటుంది కానీ చిత్ర మొదటి భాగంలో అన్ని సన్నివేశాలు బాగో లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ప్రేమ పిపాసి గురించి ఒక మాటలో చెప్పుకోవాలంటే సగటు ప్రేక్షకుడిని కూడా అలరించలేదు.

 



మధ: సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మధ సినిమా యొక్క ఫస్టాఫ్, సెకండాఫ్ లో వచ్చే త్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫస్టాఫ్ లో కొన్ని సీన్లు కాస్త బోర్ గా సాగడం వలన, కమర్షియల్ ఎలిమెంట్స్ అంశాలు లేకపోవడం వలన నేటి ఆడియన్స్ ని అంతగా అలరిస్తుందో లేదో. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకులు ఎన్నడూ చూడని చాలా డిఫరెంట్ కథతో మధ సినిమాని శ్రీవిద్య తెరకెక్కించారు. కొత్తదనం కోరుకునే సగటు ప్రేక్షకుడ్ని కచ్చితంగా ఈ సినిమా అలరిస్తుందని చెప్పుకోవచ్చు. సో, మా ప్రకారం ఈ వారం టాలీవుడ్ టాప్ ట్రెండింగ్ సినిమా మధ. 

మరింత సమాచారం తెలుసుకోండి: