టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గడచిన రెండేళ్లుగా వరుసగా విజయాలతో దూసుకెళ్తున్నారు. ముందుగా భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్, ఆపై వచ్చిన మహర్షి తో పాటు ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మూడవ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల సరిలేరు మూవీ సక్సెస్ ని తన ఫ్యామిలీ తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేసి వచ్చిన సూపర్ స్టార్, అతి త్వరలో మరొక్కసారి ఫ్యామిలీతో కలిసి హిమాలయాలకు వెళ్లనున్నారు.
 
అయితే ఆ టూర్ ని 20 రోజుల్లో ముగించుకుని వచ్చిన అనంతరం, ముందుగా మెగాస్టార్, కొరటాల సినిమా షూటింగ్ లో పాల్గొంటారని, అది ఏప్రిల్ రెండవ వారంలో జరుగుతుందని టాక్. ఆ షెడ్యూల్ దాదాపుగా 15 రోజులు జరిగిన అనంతరం, మరొక 15 రోజుల గ్యాప్ తరువాత, అనగా మే మొదటి వారం లేదా, రెండవ వారం నుండి పరశురాం పెట్ల దర్శకత్వంలో ని సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల షూటింగ్ ల విషయమై ఇటీవల మహేష్ పక్కగా ప్లానింగ్ సిద్ధం చేసారని, అనుకున్న విధంగానే వాటి షూటింగ్స్ పూర్తి చేయనున్నట్లు సమాచారం.
 
అయితే వీటిలో ముందుగా మెగాస్టార్, కొరటాల మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుండగా, పరశురాం సినిమా  వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుందట. ఇప్పటికే ఆ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి అయిందని, రాబోయే ఉగాది రోజున సినిమాని అధికారిక పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేయనున్నారని తెలుస్తోంది. దీనితో ఏకంగా రెండు సినిమాలను మహేష్ లైన్లో పేట్టడంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు...... !! 
 

మరింత సమాచారం తెలుసుకోండి: