భిక్షు యాదవ్ గా పరిచయం అయిన ఈ విలన్ అసలు పేరు ప్రదీప్ రావత్. క్రోధంగా నటిస్తూ దాడి చేసి అనేక ఫైట్స్ తో విలన్ పాత్రని అద్భుతంగా నటించే వాళ్ళల్లో ప్రదీప్ రావత్ ఒకడు. ఇతను తెలుగులో అనేక చిత్రాలలో నటించాడు. విలన్ గా ఎంతో ఫేమస్ అయ్యాడు. తనకి పలు అవార్డులు కూడా వచ్చాయి. ఇలా ప్రదీప్ రావత్ అనేక సినిమాలు చేసి సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. కేవలం తెలుగుకే పరిమితం అయిపోకుండా అటు బాలీవుడ్ లో కూడా మంచి స్థానం సంపాదించుకున్నాడు. గజిని సినిమా ప్రదీప్ రావత్ కి మంచి పేరు తీసుకొచ్చింది.
1983 సంవత్సరం నుండి సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు. ఆలా తెలుగు, హిందీ, తమిళ్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. వివిధ పాత్రలతో ఈ విలన్ తిరుగు లేకుండా దూసుకొని వెళ్ళాడు. ఇలా తాను బెంగాలీ, మలయాళం, భోజ్ పూరి, ఒడియా, కన్నడ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగులో కూడా ప్రసిద్ధి చెందాడు.
సై, భద్ర, జగపతి, ఛత్రపతి, లక్ష్మి, మాయాజాలం, స్టాలిన్, దేశముదురు, హనుమంతు, యోగి, జగడం, మైసమ్మ ఐ.పి.ఎస్, జగడం, భలే దొంగలు, నగరం, రక్షా, మస్కా, నేను శైలజ, నేనే రాజు నేనే మంత్రి, ఆచారి అమెరికా యాత్ర, కాటమరాయడు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఇలా అనేక తెలుగు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. అయితే భిక్షు యాదవ్ గా "సై" సినిమాతో మెప్పించిన అతడు అవార్డులు దక్కించుకున్నాడు. 2004 లో సై సినిమాకి ఫిలింఫేర్ అవార్డు దక్కింది. అలానే 2004 లోనే బెస్ట్ విలన్ గా సంతోషం అవార్డు వచ్చింది. అలానే నంది పురస్కారం కూడా వచ్చింది భిక్షు యాదవ్ పాత్రకి.