ఈ మధ్య కాలంలో కొందరు మనుషులు మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మూగ జీవాలపై కామ వాంఛ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కీచకులపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి, ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తి మూగజీవాన్ని రేప్ చేయడానికి ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో యాంకర్ ఈ వీడియో గురించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఒక కామాంధుడు మూగజీవాన్ని తీవ్రంగా హింసిస్తూ కామ వాంఛ తీసుకునే ప్రయత్నం చేశాడని అన్నారు. ప్రజలందరినీ ఈ వీడియో షాక్ కు గురి చేస్తోందని చెప్పారు. ఆ కీచకుడు ఎలాంటి భయం, బెరుకు లేకుండా దూడపై అత్యాచారానికి పాల్పడ్డాడని.... మూగజీవాలు మాట్లాడలేవు కాబట్టి అతడికి ఎలాంటి భయం లేదని ఆ వ్యక్తిపై తీవ్ర విమర్శలు చేశారు. 
 
ఘటనకు సంబంధించిన వీడియోను కూడా రష్మి షేర్ చేశారు. ఈ సమాజం ఎటు పోతుంది అని ప్రశ్నించారు. రష్మి చిన్నతనం నుండి జంతు ప్రేమికురాలు. ఒక యువకుడు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసి రష్మితో కొందరు ప్రముఖ నటులను ట్యాగ్ చేశాడు. ఆ వీడియోను చూసిన రష్మి ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందన వ్యక్తం చేసింది. 
 
సమాజం పట్ల బాధ్యతతో ఇలాంటి ఘటనలను రష్మి విమర్శించడంపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు రష్మి వెంటనే సోషల్ మీడియా ఖాతా ద్వారా తన స్పందన వ్యక్తం చేస్తుంది. జంతువులకు కొందరు హోలీ పండుగ సమయంలో రంగులు పూయడంపై కూడా విమర్శలు వ్యక్తం చేసింది

 

మరింత సమాచారం తెలుసుకోండి: