మాధవన్.. 2000 సమయంలో సూపర్ హీరో.. రొమాంటిక్ హీరో.. అప్పట్లో అయన తీసిన సినిమాలు అబ్బబ్బా.. ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే అవి మాటల్లో చెప్పలేనివి. ఆ సినిమాలు ఇప్పటికి ఎవర్ గ్రీనే. అంత అద్భుతంగా ఎలా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న. అసలు మాధవన్ అప్పట్లో నటించిన కొన్ని సినిమాలు ఆ కాలంలో కాదు ఈకాలంలొ రావాల్సినవి. 

 

IHG

 

సఖి సినిమా చూశారా ? షాలిని.. మాధవన్ కలిసి నటించిన సినిమా అది.. షాలిని ఏమో డాక్టర్... మాధవన్ ఏమో సాఫ్ట్ వెర్. మాధవన్ వెంటపడతాడు.. కానీ షాలిని ఒప్పుకోదు.. ఆతర్వాత షాలిని కూడా ఇష్టపడుతుంది. ఇంట్లో చెప్తే అబ్బాయ్ వాళ్ళ నాన్న డబ్బు గురించి అలోచించి.. అమ్మాయి తండ్రి ముందే చులకనా చేసి మాట్లాడుతాడు.. 

 

IHG

 

అప్పుడు ఏ లవర్స్ అయినా 1990 కాలంలో ఎం చేస్తారు.. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వింటారు.. లేదా లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. కానీ వాళ్ళు ఇద్దరు ఆలా చెయ్యలేదు. బయట ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో తెలియడం వాళ్ళను వెళ్లగొట్టడం ఇవి అన్ని కామన్ గా ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో అలానే జరుగుతాయి. 

 

IHG

 

ఇకపోతే అలాంటి సినిమా ఈ కాలంలో రావాల్సింది.. కానీ మణిరత్నం ఆలోచనల కారణంగా ఎప్పుడో 20 ఏళ్ళ కిందే వచ్చింది ఆ సినిమా. ఇంకా అలాంటి సినిమాలో నటించిన మాధవన్.. అప్పట్లో అమ్మాయిల మనసు దోచేశాడు.. నిజానికి ఆ సినిమా చూశాక తెలిసింది చాలా మంది ప్రేమికులకు ఇలా కూడా లవ్ చేసుకోవచ్చు అని. ఏది ఏమైనా ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అంతే..

మరింత సమాచారం తెలుసుకోండి: