తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నారు మహేష్ బాబు. మరోవైపు వరుస విజయాలతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఓ వైపు హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకున్న మహేష్ బాబు.. మరోవైపు నిర్మాణ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇక మహేష్ బాబుకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు బ్లాక్ బస్టర్  సినిమాలతో దూసుకుపోతున్నాడు. శ్రీమంతుడు,  భరత్ అనే నేను,  మహర్షి సినిమాలతో  అదిరిపోయే విజయాలను అందుకొని బాక్సాఫీసును షేక్ చేసాడు మహేష్ బాబు. 

 

 

 ఇక మొన్నటికి మొన్న టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతూ తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు మహేష్ బాబు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబుకు అంతకుముందు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు ని దూరం పెట్టేసాడు మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమాను ప్రస్తుతం పక్కకు పెట్టేసాడు. 

 

 

 గతంలో మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో మహర్షి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో  కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన మహేష్ బాబు సక్సెస్ కోసం పరుగెత్తే  యువకుడి పాత్రలో అందరిని ఆకర్షించి  మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా తనకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడుని  సైతం మహేష్ బాబు పక్కకు పెట్టేసి వేరే దర్శకులు వైపు చూస్తున్నారు. అంత సెట్ అయ్యి   ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుంది అనుకుంటున్న తరుణంలో.. మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమా ను పక్కన పెట్టేశారు. దీనికి కారణం వంశీ పైడిపల్లి సినిమా స్టోరీ మహేష్ బాబుకు నచ్చకపోవడమే అని గతంలో వార్తలు కూడా వినిపించాయన్న  విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: