బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి హీరోయిన్ తనుశ్రీ దత్త తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరభద్ర సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే మిస్ ఇండియా తనుశ్రీదత్తా బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించినప్పటికీ... ఆ తర్వాత అవకాశాలను మాత్రం అందిపుచ్చుకో లేకపోయింది. అయితే బాలీవుడ్లో మాత్రం పలు సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాక.. మీటూ ఉద్యమం పేరుతో తెరమీదికి వచ్చింది ఈ అమ్మడు . మీ టూ ఉద్యమానికి ఆజ్యం పోసింది తనుశ్రీదత్తా అని చెప్పవచ్చు. మీటూ ఉద్యమం పేరుతో అప్పట్లో సంచలనం సృష్టించింది తనుశ్రీ దత్త.
నానాపటేకర్ లాంటి లెజండరీ యాక్టర్ మీద లైంగిక ఆరోపణలు చేయడం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు అంటూ అప్పట్లో మీ టు ఉద్యమాన్ని ప్రారంభించి సంచలన ఆరోపణలు చేసింది తనుశ్రీ దత్త . ఇక లెజండరీ యాక్టర్ పైన ఇలాంటి ఆరోపణలు రావడం పెద్ద సంచలనంగా మారింది. అయితే దీనిపై నానా పటేకర్ మాత్రం అంతగా స్పందించలేదు. ఇది అసత్యప్రచారం అంటూ కొట్టిపారేస్తూ వచ్చారు. పదేళ్ల క్రితం హార్న్ ఓకే ప్లీజ్ సినిమా షూటింగ్ స్పాట్ లో నానాపటేకర్ తనను లైంగికంగా వేధించాడు అంటూ తన శ్రీ దత్త ఆరోపించటమే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో నానాపటేకర్ పై కేసు కూడా నమోదైంది.
నానాపటేకర్ తప్పు చేశాడని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు తేల్చగా... కొన్నాళ్ల పాటు వాయిదా పడుతూ వచ్చిన ఈ కేసు నుండి విముక్తి పొందాడు నానా . అయితే నానా పటేకర్ పై లైంగిక ఆరోపణలు చేసి మీటూ ఉద్యమం పేరుతో సంచలనం సృష్టించిన తనుశ్రీదత్తా ఆతర్వాత మానసికంగా ఆర్థికంగా ఎంతగానో కుమిలిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ అమ్మడు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. తనుకు కుంగిపోవడానికి కారణమైన వారిపై పగ తీర్చుకుంటాను అనే నిర్ణయంతో ఉందట ఈ అమ్మడు . అంతేకాకుండా తనకు మద్దతుగా నిలిచిన వారికి భవిష్యత్తులో అండగా ఉంటానని ప్రతిజ్ఞ కూడా చేసిందట.