తెలుగు అమ్మాయే అయినా తమిళంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ ఐశ్వర్యా రాజేష్. తెలుగులో విలన్, హీరోగా నటించిన రాజేష్ తనయురాలే ఈ ఐశ్వర్య. క్యారక్టర్ ఆర్టిస్ట్ శ్రీలక్షికి స్వయానా మేనకోడలు. తమిళంలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఐశ్వర్య రాజేష్ కు తెలుగులో మాత్రం సరైన ఫ్లాట్ ఫామ్ దొరకలేదని చెప్పొచ్చు. తమిళంలో ఆమె క్రేజ్ చూసి తెలుగులో విజయ్ దేవరకొండ పక్కన ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా కంటే ముందు కౌసల్యా కృష్ణమూర్తి సినిమా చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అవగా ఎన్నో ఆశలు పెట్టుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఆమెకు షాక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ నటన వరకు బాగున్నా సినిమా కథ, కథనాలు ప్రేక్షకులను మెప్పించలేదు. 

 

క్రాంతి మాధవ్ తనకు వచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని సరిగా వాడుకోలేదు. విజయ్ దేవరకొండ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫెయిల్యూర్ పై కొద్దిగా అప్సెట్ అయ్యాడు. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా బిజీ అవ్వాలని చూస్తుంది. అందుకే ఇక్కడ ఛాన్స్ వస్తే లిప్ లాక్స్ చేసేందుకు సై అంటుంది అమ్మడు. 

 

కథ డిమాండ్ చేస్తే ఇలాంటి పాత్ర చేసేందుకు అయినా తానూ సిద్ధమే అని.. అంతేకాదు లిప్ లాక్ చేసేందుకు తాను వెనుకాడనని అంటుంది ఐశ్వర్య రాజేష్, ధనుష్ తో చేసిన వడ చెన్నై సినిమాలో లిప్ లాక్ కంపల్సరీ అనిపించింది. అందుకే ఆ సినిమాలో తాను లిప్ లాక్ చేశానని.. కథకు అవసరం అనిపిస్తే తప్పకుండా లిప్ లాక్ చేస్తా అంటుంది ఐశ్వర్య రాజేష్, ఇక తన అందం మీద ఎప్పుడూ సెటైర్ వేసుకునే ఐశ్వర్య రాజేష్ తను ఇప్పుడున్న రేంజ్ ఊహించాలదని చెప్పుకొచ్చింది. తమిళంలో అమ్మడి టాలెంట్ గుర్తించారు.. కాని తెలుగులోనే ఐశ్వర్య రాజేష్ కు ఇంకా బ్యాడ్ టైం నడుస్తున్నట్టు ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: