దాదాపు రెండేళ్ల క్రితం అమలాపాల్ దర్శకుడు విజయ్ నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం కొంతకాలం ఒంటరిగా జీవించిన అమల తాజాగా తన ప్రియుడు భవిందర్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పెళ్లిలో తీసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అమల అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పెళ్లి ఫోటోలను షేర్ చేస్తున్నారు. 
 
గతంలో ఎ ఎల్ విజయ్ తో విడాకుల అనంతరం ఒక వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని అమలాపాల్ వ్యాఖ్యలు చేశారు. ప్రియుడికి సంబంధించిన వివరాలను మాత్రం అమలాపాల్ చెప్పలేదు. ఆ తర్వాత ముంబాయికి చెందిన సింగర్ భవిందర్ సింగ్ అమలా పాల్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలలో అమల, సింగర్ సన్నిహితంగా ఉండటంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వదంతులు వచ్చాయి. 
 
సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై అమల స్పందించలేదు. కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగినట్లు సమాచారం. 2019 జులైలో అమలాపాల్ మొదటి భర్త విజయ్ రెండో వివాహం చేసుకున్నారు. అమలను సినిమాల్లో నటించవద్దని విజయ్ షరతులు విధించటంతో ఆమె విడిపోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 
 
తాజాగా అమలాపాల్ పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి హాట్ టాపిక్ అయింది. ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్లు మాత్రం దేశమంతా కరోనాకు భయపడి గజగజా వణుకుతోంటే వీరు మాత్రం పెళ్లి అంటూ హంగామా చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అమలాపాల్ వివాహం ఎప్పుడు జరిగింది...? ఎక్కడ జరిగింది...? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. కొందరు నెటిజన్లు మాత్రం అమలాపాల్ ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందంటే నమ్మలేకపోతున్నాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.         

మరింత సమాచారం తెలుసుకోండి: