వేసవి వస్తుందంటే చాలు బాక్సాఫీస్ కు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. సమ్మర్ సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుంటాయి.  కానీ వేసవికి మాత్రం థియేటర్లు వెలవెలబోతున్నాయి. కరోనా భయానికి సినిమా హాళ్లకు తాళాలు వేస్తున్నారు. దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కోట్లలో నష్టాలొస్తున్నాయి. 

 

సమ్మర్ ని క్యాష్ చేసుకోవాలని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది హీరోలు స్కెచ్చులు రెడీ చేసుకున్నారు. నాని నుంచి మొదలుపెడితే.. విజయ్, అక్షయ్ కుమార్ వరకు స్టార్లంతా సమ్మర్ పై బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడుతున్నాయి. దీంతో వీళ్ల సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. 

 

ఇంద్రగంటి మోహనకృష్ణ, నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన థ్రిల్లర్ వి. 25వ సినిమాగా కెరీర్ లో లాండ్ మార్క్ ఫిల్మ్ గా రూపొందిన వి పై నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు. పైగా ఈ మూవీలో నాని కొంచెం గ్రే-షేడ్ లో కనిపిస్తాడని చెబుతున్నారు. దీంతో ఆడియన్స్ మార్చి 25కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు ఖాళీ అవుతూ ఈ సినిమాను వాయిదా వేశాయి. 

 

ప్రేక్షకుల సంఖ్యను బట్టి లాభాల్లోకి వెళ్లే పాప్ కార్న్, కూల్ డ్రింక్ వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. కానీ ఇప్పుడు థియేటర్లు మూతపడటంతో పార్కింగ్ ఏజెంట్స్ నుంచి మొదలుపెడితే.. థియేటర్ల యాజమాన్యాలు.. నిర్మాతలు నష్టపోతున్నారు. 

 

మూడు, నాలుగు వారాల పాటు సినిమాలు ఆగిపోతే పరిశ్రమ చాలా నష్టపోతుందని చెప్పొచ్చు. వారానికి రెండు మీడియం బడ్జెట్ సినిమాల లెక్కన తీసుకున్నా 30 నుంచి 50కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది. ఇక మూడు వారాలు మూతబడితే 150కోట్ల వరకు నష్టం వచ్చే ప్రమాదముంది. ఇప్పటికే కేరళ, ఢిల్లీలో థియేటర్లు మూతబడ్డాయి. ఇండియా వైడ్ గా చూసుకుంటే మొత్తం మీద వెయ్యి కోట్లకు పైగా నష్టమొచ్చే ప్రమాదముంది అంటోంది ట్రేడ్ మార్క్. 

మరింత సమాచారం తెలుసుకోండి: