యంగ్ హీరో నితిన్ అప్పట్లో ప్లాప్ సినిమాల లిస్ట్ లో చేరిపోయాడు. ఒకే ఒక్క హిట్ కోసం వేచిచూసాడు. ఆ టైం లోనే భీష్మ సినిమా ద్వారా హీరోగా వచ్చాడు. సినిమా సూపర్ హిట్ అయింది. నితిన్ కి జోడిగా రష్మిక మందన్న నటించింది. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు నితిన్ మంచి జోష్ మీద ఉన్నాడు.
ఒక పక్క పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అలాగే మరోపక్క హిందీలో హిట్టైన ‘అంధాదున్’ సినిమాను తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ చేయబోతున్నాడు. విచిత్రం ఏంటంటే హీరో నితిన్.. బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుంటే, తెలుగులో నితిన్ నటించిన టాలీవుడ్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తుండడం. అవును నిజమే తెలుగు లో నితిన్ నటించిన భీష్మ సినిమాని ఇపుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి.
సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో విజయం సాధించిన సినిమాను మరొక భాషలో రీమేక్ చేయడం సహజం. భీష్మ చిత్ర హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ రేటుకే దక్కించుకున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఒకవేళ రణ్‌బీర్ కపూర్ ఒప్పుకోకపోతే.. వరుణ్ ధావన్ లేదా టైగర్ ష్రాఫ్ హీరోగా రీమేక్ చేయాలనే ఆలోచనలో కరణ్ జోహార్ ఆలోచిస్తున్నాడట.
ఇప్పటికే కరణ్ జోహార్.. విజయ్ దేవరకొండ ఫ్లాప్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ హక్కులను చేజిక్కించుకున్నాడు. తెలుగులో ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. హిందీలో ఈ సినిమాను పూర్తిగా కధ మార్చి తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట. అయితే తాజాగా కరణ్ జోహార్ నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేయడం విశేషం. భీష్మ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధిస్తుందనే ఆలోచనతోనే హిందీలో రీమేక్ చేస్తున్నారట.