కోవిడ్-19 అదేనండి కరోనా వైరస్ వల్ల సినిమా షూటింగులు అన్నీ బంద్ చేశారు. తెలుగు రెండు రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాల్సిందే అని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే స్టార్స్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఖాళీ సమయాల్లో వారు చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నారు. అందరు ఏమో కానీ కాజల్ మాత్రం ఈ ఖాళీ సమయాల్లో కూడా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. అదేంటి అంటే కాజల్ కు ఇష్టమైన ఆట చెస్.. కానీ అది ఆడటం మాత్రం రాదట. ఈ ఖాళీ సమయాల్లో కాజల్ చెస్ ను నేర్చుకుంటుందట. చెస్ లో చాంపియన్ అయ్యేంతలా కాకున్నా మాములుగా నేర్చుకుంటుందట అమ్మడు.
ఎంతోమంది కొత్త కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నా సరే ఈ ముదురు భామకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్యకు ఆమె సైన్ చేసినట్టు తెలుస్తుంది. కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా ఇండియన్ 2 సినిమాలో కూడా కాజల్ నటిస్తుంది. ఆ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యత పొందుతుందట ఈ అమ్మడు. ఓ పక్క చెస్ మరోపక్క మార్షల్ ఆర్ట్స్ కాజల్ ఇంటి దగ్గర కూడా బాగా వర్క్ అవుట్స్ చేస్తుంది.
చిరు నటించిన ఖైదీ నంబర్ 150 సినిమాలో కూడా కాజల్ నటించింది. ఓ విధంగా చెప్పాలంటే కాజల్ కెరియర్ కు మళ్ళీ బూస్ట్ ఇచ్చింది ఆ సినిమానే. ఆచార్యలో చిరుకి జోడీగా ముందు అనుష్క, త్రిష లాంటి వారి పేర్లు వినపడవు ఫైనల్ గా కాజల్ ను ఫిక్స్ చేశారు. కాజల్ రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసినా ఆమెకు ఉన్న క్రేజ్ సినిమాకు యాడ్ అవుతుందని భావించి అమ్మడిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.