కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన రష్మిక మందన్న అక్కడ కిరాక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ అయింది. ఇక తెలుగులో ఛతో సూపర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు రీసెంట్ గా మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. స్టార్ లీగ్ లోకి వచ్చిన రష్మిక లేటెస్ట్ గా మరో మెగా ఛాన్స్ అందుకుంది తెలుస్తుంది. ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమాలో అమ్మడు హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుండగా ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా ఆచార్య సినిమాలో కూడా రష్మిక సెలెక్ట్ అయిందని తెలుస్తుంది.
అదేంటీ చిరు పక్కన త్రిష బదులుగా కాజల్ ఫైనల్ అయ్యిందని అన్నారు కదా మరి సడెన్ గా ఈ ప్రాజెక్ట్ లోకి రష్మిక ఎలా వచ్చింది అనుకోవచ్చు. చిరు సినిమాలో రష్మిక నటిస్తున్న విషయం నిజమే కానీ చిరుకి జోడిగా కాకుండా రామ్ చరణ్ కు జతగా ఆమె నటిస్తుందని తెలుస్తుంది. కొరటాల శివ రాసిన ఆచార్యా కథలో మరో హీరోకి ఛాన్స్ ఉంది. అసలైతే ఆ పాత్రకు ముందు సూపర్ స్టార్ మహేష్ నటిస్తాడని అన్నారు. కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించి మహేష్ స్థానంలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.
సినిమాలో చరణ్ తో రష్మిక రొమాన్స్ అదిరిపోతోందని తెలుస్తుంది. తెలుగులో సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక మెగా మూవీలో లక్కీ ఛాన్స్ అందుకోవడం ఆమె కెరియర్ కు మరింత జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు. మహేష్ తో మొదలు పెట్టిన రష్మిక వరుసగా స్టార్ ఛాన్సులు అందుకుంటుంది మరి మెగా మూవీలో రష్మిక ఎలా అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా కోసం అమ్మడికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.