కరోనా భయాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హడాలిపోతు ఎవరి ఇంటికి వారు పరిమితమైపోయినా ఆవిషయాలను పక్కకు పెట్టి రామ్ చరణ్ అభిమానులు మాత్రం చరణ్ పుట్టినరోజును బాగానే ఎంజాయ్ చేసారు. సోషల్ మీడియా వేదికగా చరణ్ పుట్టినరోజును తమ హీరో వద్దు అన్నా పట్టించుకోకుండా చాల ఘనంగా నిర్వహించారు.
ఇలాంటి పరిస్థితులలో కొందరు పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు పవన్ వయస్సు పై చర్చలు చేయడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. వికిపీడియా ప్రకారం పవన్ 1969 లో పుట్టాడు అని తెలుస్తుంది. దానిప్రకారం అతడి వయస్సు 51 ఏడాది సెప్టెంబర్ కు 52 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు.
ఈ విషయాలు అందరికీ తెలిసినవే అయితే రామ్ చరణ్ పుట్టినరోజునాడు చిరంజీవి తన ట్విటర్ లో షేర్ చేసిన ఫోటోలో చరణ్ ను పవన్ ఆశీర్వదిస్తున్నట్లు ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో పవన్ 20 సంవత్సరాల వయసులో ఉన్నట్లు కనిపించడంతో ఇప్పుడు చరణ్ వయసు 35 సంవత్సరాలు కాబట్టి పవన్ వయసు 55 సంవత్సరాలు పైన ఉంటుందా అంటూ ఒక అనవసరపు చర్చకు తెర లేపారు.
వాస్తవానికి దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం తీసిన ఆ ఫోటోలో పెద్దగా క్లారిటీ లేదు. అయితే అప్పటి లేటెస్ట్ కెమెరాలతో తీసిన ఫోటో కావడంతో పాటు పవన్ లాంగ్ షాట్ లో కనిపిస్తున్న పరిస్థితులలో ఆ ఫోటోలో పవన్ వయసు ఎంత అన్నది అంచనాలు వేయడం చాల కష్టం. అయినా పవన్ ఏమి చేసినా మెచ్చుకునే వారి సంఖ్యను మించి విమర్శించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది అని చెప్పే విషయంలో ఉదాహరణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వయసు పై జరుగుతున్న అనవసరపు చర్చలు. ఇది ఇలా ఉంటే పవన్ కరోనా బాధితుల సహాయానికి విరాళాలు అందించిన సెలెబ్రెటీలు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన కామెంట్ పవన్ అందరివాడుగా మారడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది..