తెలుగు ఇండస్ట్రీలో అష్టా చమ్మ చిత్రంతో హీరోగా పరిచయం అయిన నాని తర్వాత వచ్చిన చిత్రాల్లో పిల్ల జమిందార్ తర్వాత ఎవడే సుబ్రమణ్యంతో కాస్త పేరు సంపాదించాడు.  మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంలో మతిమరుపు వీక్ పాయింట్ తో కడుపుబ్బా నవ్వించాడు.  ఈ చిత్రం సక్సెస్ నాని రేంజ్ ఎక్కడికో తీసుకు పోయింది.  వరుసగా హిట్ అందుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఓ వైపు హీరోగా మరో వైపు నిర్మాతగా తన సత్తా చాటుతున్నాడు నాని.  తాజాగా నాని, సుధీర్ బాబు ‘ వి’ చిత్రంలో నటిస్తున్నారు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం.. కరోనా కష్టాలు ఉండటంతో అన్ని చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. 

 

ఈ చిత్రం తర్వాత మరో రెండు చిత్రాలు లైన్లో పెట్టాడు నేచురల్ స్టార్ నాని.   ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం  పై, అభిమానులందరిలో ఆసక్తి వుంది. ఆ తరువాత సినిమాగా నాని 'శ్యామ్ సింగ్ రాయ్' చేయనున్నాడు. 'టాక్సీవాలా' దర్శకుడు రాహుల్ ఈ   చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రంలో నాని ని సరికొత్తగా చూపించబోతున్నారట. గత కొంత కాలంగా నాని తన పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జెర్సీ చిత్రంలో బాద్యతగల తండ్రిగా,  వి చిత్రంలో విలన్ షేడ్స్ తో కనిపిస్తున్నాడు. 

 

తాజాగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో నాని డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ ను ఎంతో ఉత్కంఠ భరితంగా డిజైన్ చేశారట. సెకండాఫ్ లో నాని నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. నాని కెరియర్లోనే ఈ చిత్రం ప్రత్యేకమైందిగా నిలవడం ఖాయమని చెబుతున్నారు.  ఈ చిత్రాలనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరాలో తెలుపుతామని చిత్ర యూనిట్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: