సర్వసాధారణంగా కీర్తి సురేశ్ పై గాసిప్పుల వార్తలు రావు అయితే ఎవరు ఊహించని విధంగా ఆమె కు త్వర లో పెళ్లి జరగబోతోంది అంటూ తమిళ మళయాళ మీడియాలలో వస్తున్న వార్తలు చాలా మందికి షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి కెరియర్ ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు.
ఇక వివరాలలోకి వెళితే కీర్తి సురేశ్ కుటుంబానికి సినిమారంగ నేపధ్యంతో పాటు రాజకీయ నేపథ్యం ఉంది. తండ్రి సురేష్ వ్యాపారవేత్తనే కాకుండా కేరళ బీజేపీ లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తల్లి మేనక కూడా సినీనటి. ప్రస్తుతం కీర్తి టాప్ హీరోయిన్ స్థాయిలో కొనసాగుతున్న ఆమెకు పెళ్లిచేయాలి అన్న ఆలోచనలు ఆమె తల్లి తండ్రులకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు బీజేపీ పార్టీలో కీలకంగా కొనసాగుతున్న ఒక వ్యాపారవేత్త కుమారుడితో కీర్తి పెళ్లికి సంప్రదింపులు జరుగుతున్నాయని తమిళ మీడియా ప్రముఖంగా వార్తలు రాస్తోంది. తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు కీర్తి సురేష్ కూడ సానుకూలంగా స్పందిస్తున్నట్టు కూడ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కీర్తిని పెళ్లి చేసుకోవాలి అని ముచ్చట పడుతున్న వ్యక్తి కేరళలో మోస్ట్ వీఐపీ గా చెలామణి అవుతున్న వ్యాపారవేత్త కొడుకు అని తెలుస్తోంది. దీనికితోడు ఆమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి తాను అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పిన పరిస్థితులలో మీడియా అత్యుత్సాహంతో ఇలాంటి వార్తలు పుట్టించింద అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఈ విషయమై కొన్ని తమిళ మీడియా సంస్థలు కీర్తి తండ్రి స్పందన కోసం ప్రయత్నిస్తే సురేశ్ స్పందించలేదు అని తెలుస్తోంది. దీనితో ఈ వార్తలను కీర్తి తండ్రి మౌనంగా ఉండటంతో ఈ వార్తలలో ఎంతోకొంత నిజం ఉండి ఉంటుంది అన్న సందేహాలు మరికొందరు వ్యక్త పరుస్తున్నారు..