
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చిన్నతనం నుండి చాల గారాబంగా తల్లి దగ్గర పెరిగింది. దీనికితోడు జాన్వీ ప్రతి విషయంలోనూ చాల దూకుడుగా ప్రవర్తిస్తుంది. జాన్వీలో మార్పు తీసుకురావాలని శ్రీదేవి జీవించి ఉన్న రోజులలో ఎన్నో ప్రయత్నాలు చేసింది.
వాస్తవానికి జాన్వీని సినిమా హీరోయిన్ గా కాకుండా పెద్ద డాక్టర్ గా చూడాలని శ్రీదేవి చాల కలలుకన్నది. అయితే జాన్వీ కి సినిమాల పై ఉండే విపరీతమైన మోజు ఆమెను హీరోయిన్ గా మార్చి ‘ధడక్’ మూవీతో క్రేజీ హీరోయిన్ గా మార్చింది. తన కూతురు సినిమాను చూడకుండానే శ్రీదేవి చనిపోయినా ఆమె మరణం జాన్వీ ప్రవర్తనలో పెద్దగా మార్పులు తీసుకురాలేదు.
అయితే కరోనా శ్రీదేవి కూతురు ఆలోచనలలో అనేక మార్పులు తీసుకు వచ్చింది అని స్వయంగా జాన్వీ ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఆన్ లైన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ‘వారం నుంచి లాక్ డౌన్ లో ఉంటున్నా. ఈ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను తెలుసుకున్నాను. రోజూ తింటున్న ఆహారం విలువేంటో ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా తినడానికి తిండిలేని వాళ్ల గురించి కథలు కథలుగా వింటున్నాను. ఇంట్లో తినడానికి సరిగ్గా ఆహారంలేక ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడానికి సాహసం చేసి బయటకు వెళ్తున్న వాళ్లను చూస్తుంటే ఏదో తెలియని బాధ, భయం. ఇలాంటి అభాగ్యుల గురించి ఇంత కాలం ఆలోచించకుండా నేనెంత స్వార్థంతో, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించానో తెలుసుకున్నాను’ అంటూ జాన్వీ చాల నిజయితీగా తన జీవితంలో చేసిన తప్పులను అంగీకరించింది.
అంతేకాదు తన తల్లి శ్రీదేవి తన ప్రవర్తన వల్ల ఏవిధంగా బాధపడి ఉంటుందో తాను ఇప్పుడు తాను ఇప్పుడు ఆలస్యంగా గ్రహించాను అంటూ కరోనా నేర్పించిన పాఠాలతో వేదాంతిగా జాన్వీ మారిపోయింది. ‘కరోనా వల్ల ఒకవిధంగా తన మనసు నీట్ గా శుభ్రం అయింది ప్రతిరోజూ మా నాన్న మమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నారో తెలుసుకున్నాను’ అంటూ జాన్వీ చేసిన కామెంట్స్ పరిశీలిస్తే కరోనా జాన్వీలో చాల మానసిక పరివర్తన కలిగించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు..