ప్రముఖ బాలీవుడ్ గాయనీ క‌నికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్‌ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్‌ వచ్చిన కనికా కపూర్‌ హోటల్‌లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్‌లోకి పంపించారు. వరసగా నాలుగు సార్లు కరోనా పాజిటివ్ వచ్చినా.. ఇప్పుడు ఐదోసారి ఆమెకు నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు.. కుటుంబ సభ్యులు.  ప్రస్తుతం రిపోర్టులలో నెగిటివ్ అని వచ్చినప్పటికీ మరికొంత కాలం ఆమె ఆసుపత్రిలో ఉండనున్నారని తెలుస్తోంది.

 

కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత 8 రోజులపాటు వైద్యులు టెస్ట్‌లు చేస్తారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ లో మరో సంచలనం రేకెత్తించింది.  కనికా కపూర్ స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ వార్డులో ఆమెను చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.  షాజా మోరానీ కుటుంబసభ్యులకు కూడా వైద్యులు కరోనా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.

 

లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే ఆస్ట్రేలియా నుంచి షాజా ఇండియాకు తిరిగొచ్చింది. షారుఖ్ ఖాన్, దీపికా పడుకునే జంటగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్'ను కరీమ్ మొరానీ నిర్మించారు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సెలబ్రెటీల ఎన్నో రకాల వీడియోల, సోషల్ మేసేజ్ లు ఇస్తున్న విషయం తెలిసిందే.  హాలీవుడ్ లో ఏకంగా కరోనాతో మరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: