ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ని కట్టడి చేసే నిమిత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేనపథ్యంలో సినీ తారలంతా తమ ఇళ్లకే పరమితం అయ్యారు.  తాజాగా మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నటిగా బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతుంది. అంతే కాదు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.  షూటింగ్ లు కూడా ఆపివేయడంతో సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు వినోదం పంచుతున్నారు. తాజాగా  ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మికి చిర్రెత్తుకొచ్చింది. అతనికి దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.

 

చిరంజీవి లాంటి స్టార్ లు సైతం ఇప్ప్పుడు సోషల్ మీడియా లోనే కాలం గడుపుతూ ఫ్యాన్స్ కి మరింత  దగ్గరవుతున్నారు.  ఓ నెటిజన్ మంచు లక్ష్మికి వేసిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం చూసి అందరూ షాక్ తిన్నారు. సోషల్ మీడియాలో మంచు లక్ష్మి చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎన్నో విషయాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది.  అక్కా మీ నెట్ ఫ్లిక్స్ ఐడీని షేర్ చేయండి.. అని కామెంట్ పెట్టాడు.

 

దీనిపై మంచు లక్ష్మి ఘాటుగా స్పందించింది.  నీ బ్యాంక్ అకౌంట్ డీటైయిల్స్ చెప్పు తమ్ముడు...  ఆన్ లైన్ షాపింగ్ చేసుకుంటా  అని రిప్లై ఇచ్చింది. దాంతో మనోడికి సౌండ్ లేకుండా పోయింది. కాగా, లక్ష్మి చేసిన కామెంట్ కి అందరూ మంచి సమాధానం ఇచ్చారు అంటూ ప్రశంసించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: