కొన్నాళ్ల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తగా అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలను కొందరు సినిమా మేనేజర్లు, కో ఆర్డినేటర్లు వంటివారు అమాయకమైన అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి వారిని లైంగికంగా లొంగదీసుకుంటున్నారని, ఇది దారుణం అని, కావున మా అసోసియేషన్ వారు స్పందించి ఇటువంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని నటి శ్రీరెడ్డి కోరడం జరిగింది. అయితే ఆమె అభ్యర్ధనతో మా అసోసియేషన్ దిగిరాకపోవడంతో ఆ తరువాత మా ఆఫీస్ ముందు ఆమె అర్ధ నగ్న ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ఆ ఘటన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులరైన శ్రీరెడ్డి, ఆ తరువాత కొందరు సినిమా ప్రముఖులు తనను లైగికంగా వాడుకుని అవకాశాలు ఇప్పిస్తాం అని చెప్పి మోసగించారని ఆమె ఆరోపించడం జరిగింది. 
 
 
ఆపై శ్రీరెడ్డి ఒకానొక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు గురైంది. ఇక ఇటీవల హైదరాబాద్ నుండి తమిళనాడుకు పూర్తిగా తన నివాసాన్ని మార్చిన శ్రీరెడ్డి, ఇప్పటికీ కూడా మన సినిమా నటులు, రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూనే ఉంది. అంతేకాక మధ్యలో తమిళనాడు గురించి ఆమె పొగడ్తలు కురిపిస్తోంది కూడా. అయితే అదే ప్రస్తుతం ఆమెపై మన తెలుగు ప్రజలకు కొంత ఆగ్రహం తెప్పించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో ప్రపంచం అంతా అట్టుడికిపోతూ భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. అయితే దానిని ఉద్దేశించి, దేవుడా ఈ ప్రపంచాన్ని, ముఖ్యంగా నా తమిళనాడుని రక్షించు తండ్రి, తమిళనాడు రాక్స్ అంటూ ఆమె ఒక పోస్ట్ పెట్టింది.  
 
 
ఛీ, ఛీ..మనిషిగా పుట్టాక అలా మాట్లాడడానికి కొంతైనా సిగ్గు సెరం, మానం, అభిమానం ఉండాలి, నువ్వు పుట్టింది తెలుగు రాష్ట్రంలో, నీకు కొద్దొగొప్పో గుర్తింపుని ఇచ్చింది తెలుగు రాష్ట్రం, ఇక్కడి ప్రజలు, అలాంటిది దానితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలని కోరుకుండా, కేవలం తమిళనాడు గురించి మాట్లాడడం నిజంగా నీచం అంటూ ఆమెపై కామెంట్స్ రూపంలో తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: