విజయ్ దేవరకొండ.. ఎంత సట్రెయిట్ ఫార్వర్డో, ఎంత డేరింగో ఎంత బోల్డో అందరికీ తెలుసు. నిన్న కాకమొన్నొచ్చిన ఈ రౌడీ హీరో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకుని టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. అయితే ఇంత కాన్ఫిడెంట్ గా ఉండే ఈ హీరో ఇప్పుడు ఫుల్ టెన్షన్ పడుతున్నాడు . అంతేకాదు.. తన హీరోయిన్ ని కూడా టెన్షన్ పెడుతున్నాడు.
 
రౌడీ హీరో.. ప్రజెంట్ పూరీ జగన్నాధ్  తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.  ముంబై లో 40 రోజుల లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఫైటర్ టీమ్.. ఇప్పుడు కరోనా తో షూట్ కి బ్రేక్ ఇచ్చింది. కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో ప్యాన్ ఇండియా లెవల్లో  తెరకెక్కుతోంది.

 

విజయ్.. ఈ సినిమా షూట్ అయ్యేంతవరకూ టెన్షన్ తప్పదు అంటున్నాడు . అంతేకాదు.. ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న అనన్య పాండే కూడా టెన్షన్ పడుతోంది. ఇంతకీ ఏంటి అని అడిగితే.. ఫస్ట్ టైమ్ నేను తెలుగు నుంచి ఇండియన్ బిగ్గెస్ట్ ఫ్లాట్ ఫామ్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాను. ఫస్ట్ టైమ్ బాలీవుడ్ వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో  అని నెర్వస్ ఫీలవుతున్నానంటున్నాడు.
 
ఎట్ ద సేమ్ టైమ్ .. హీరోయిన్ అనన్య కూడా నెర్వస్ ఫీలవుతోంది. ఎందుకంటే .. ఇప్పటివరకూ బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసిన అనన్య.. బాలీవుడ్ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. అందుకే  టాలీవుడ్ ని ఇంప్రెస్ చెయ్యగలుగుతానా లేదా అని వర్రీ అవుతోందట ఈ ముద్దుగుమ్మ.  సో.. సినిమా రిలీజ్ అయితే కానీ .. వీళ్లిద్దరి టెన్‌షన్ కి ఫుల్ స్టాప్ పడేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: