కరోనా సమస్యతో జనం అంతా గృహ నిర్భందంలో కొనసాగుతున్న పరిస్థితులలో ఎన్నడూ లేని విధంగా బుల్లితెర సీరియల్స్ కంటే న్యూస్ ఛానల్స్ కు అత్యధిక రేటింగ్స్ వస్తున్న పరిస్థితులలో ఈ రెటింగ్స్ ను నిలబెట్టుకోవడానికి న్యూస్ ఛానల్స్ అనేక ఆసక్తికర చర్చలు కరోనా పరిస్థితుల పై వాస్తవ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన చర్చా గోష్టి కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ పాల్గొని ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


లాక్ డౌన్ ఎత్తివేసాక కూడ జనం కరోనా భయాల నుండి బయటపడటానికి కనీసం రెండు నెలల కాలం పడుతుందని అప్పటి వరకు సినిమా ధియేటర్స్ ఓపెన్ అయినా జనం ధైర్యంగా ధియేటర్లకు వస్తారు అన్న నమ్మకం తనకు లేదు అంటూ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులలో భవిష్యత్ లో సినిమా నిర్మాణ బడ్జెట్ విషయంలో చాల మార్పులు వస్తాయని ఇదివరకు లా భారీ సినిమాల నిర్మాణం వైపు నిర్మాతల ఆసక్తి తగ్గుతుంది అని షాకింగ్ కామెంట్స్ చేసాడు.


ఇలాంటి పరిస్థితులలో హీరోలు ఇతర నటీనటులకు ఇచ్చే భారీ పారితోషికాల విషయంలో కూడ చాల మార్పులు వస్తాయని ఇండస్ట్రీలో వచ్చే ఈ మార్పులకు టాప్ హీరోలు కూడ సహకరించ వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ భవిష్యత్ లో టాప్ హీరోల పారితోషికంలో భారీ కోతలు ఉండబోతున్న సంకేతాలు ఇచ్చాడు. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి ఎన్ని ఒటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చినా ధియేటర్లలో సినిమా చూసిన ఆనందం ఇంటిలో కూర్చుని సినిమా చూస్తే రాదనీ అందువల్ల ఫిలిం ఇండస్ట్రీకి అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు వల్ల ఇండస్ట్రీకి పెనుప్రమాదం పొంచి ఉన్నది అన్న విషయాన్ని తాను అంగీకరించను అంటూ దిల్ రాజ్ కామెంట్స్ చేసాడు. 


దీనితో ప్రస్తుతం 40 కోట్ల పారితోషికాలు పుచ్చుకుంటున్న మన టాప్ హీరోలు అందరికీ దిల్ రాజ్ కామెంట్స్ ఊహించని షాక్ అనుకోవాలి. అయితే కరోనా పరిస్థితులు సద్దుమణిగాక బాగా గ్యాప్ తీసుకుని వచ్చే ఏడాది విడుదలయ్యే రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ఊహించిన విధంగా ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తే మళ్ళీ అప్పటి నుండి టాప్ హీరోల సినిమాల విషయంలో నిర్మాతల ఆలోచనలు మారిపోయే ఆస్కారం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: