స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కి పుష్ప టైటిల్ ని ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. నేడు అల్లు అర్జున్ 36వ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో బన్నీతో పాటు హీరోయిన్ రష్మిక కూడా మాస్ క్యారెక్టర్ లోనే నటిస్తున్నట్లు తెలుస్తోంది. శేషాచలం అడవులు ప్రాంతంలో ఇటీవల ఈ సినిమా భారీ షెడ్యూల్ జరుపుకుంది. 

 

ఇకపోతే కాసేపటి క్రితం ఈ సినిమా సెకండ్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు సినిమా యూనిట్ సభ్యులు. పోలీస్ స్టేషన్ లో గంధపు చెక్కలతో పాటు బన్నీ కూర్చుని ఉన్న ఆ పోస్టర్ తో సినిమా పై ఆయన ఫ్యాన్స్ లో మరింతగా అంచనాలు పెంచాయి అనే చెప్పాలి. అలవైకుంఠపురములో సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో ఒక్కసారిగా పూర్తిగా తనకు తాను ట్రాన్స్ ఫార్మ్ అయి ఇంత మాస్ లుక్ లోకి మారడం కేవలం బన్నీకి మాత్రమే సాధ్యం అయింది అంటూ పలువురు ప్రేక్షకులు, ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

 

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్, యాక్షన్ అంశాలతో పాటు సుకుమార్ మార్క్ టేకింగ్ తో ఆకట్టుకునేలా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్నట్లు సమాచారం. అయితే ఈ పోస్టర్లు చూస్తుంటే సుకుమార్ ఇటీవల రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం సినిమా గుర్తుకువస్తుంది అని అంటున్న వాళ్ళు ఉన్నప్పటికీ, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని, అయితే దాని మాదిరిగా ఇది కూడా అదేవిధంగా మాస్ స్టైల్ లో సాగినప్పటికీ, రెండిటికి పూర్తిగా కథ, కథనాల్లో చాలా తేడా ఉందని, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత సినిమా మంచి హిట్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: