ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీల గురించి ప్రతి ఒక్కటీ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అమెరికా, చైనా, ఇటలీ లాంటి పెద్ద దేశాల్లో గంట గంటకూ పెద్ద ఎత్తునే మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు బారత దేశంలో కూడా దీని ప్రభావం పెరిగిపోతుంది.  వాస్తవానికి లాక్ డౌన్ నేపథ్యంలో జనాలు అందరూ ఇళ్లకే పరిమితం కాగా.. కరోనా లక్షణాలున్నవారు హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి షెఫాలీ కుటుంబానికి కరోనా వైరస్ వచ్చిందని ఓ వార్త హల్చల్ చేస్తుంది.

 

తన ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసి కొందరు.. తన ఫ్యామిలీ మెంబర్లకు కరోనా వైరస్ వచ్చిందని పోస్ట్ పెట్టారని తెలిపారు. దీన్ని ప్రజలెవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వివరణ ఇచ్చారు. తన ఫ్యామిలీలో అందరికీ కరోనా వచ్చిందన్న ఫేస్‌ బుక్‌ పోస్టులో నిజం లేదని చెప్పారు. తన కుటుంబ సభ్యులు, తాను క్షేమంగానే ఉన్నామని తెలిపారు. 

 

సోషల్ మీడియా ఖాతాలో పోస్టు రాసిందెవరో దేవుడికే తెలియాలి, నేను నా కుటుంబసభ్యులందరం ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాం అని షెఫాలీ షా పేర్కొన్నారు. హ్యాకర్ పెట్టిన పోస్టు చూసి తనను సంప్రదించిన వారికి షెఫాలీ షా కృతజ్ఞతలు తెలిపారు.  దయచేసి ఇలాంటి వార్తలు రాసి మనోభావాలు దెబ్బతినేలా చేయొద్దని విన్నవించుకుంది.  కాగా, బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ అతని కూతుళ్లకు కరోనా పాజిటీవ్ అని తేలింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: