తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి రూపొందుతున్న సినిమా "పుష్ప" టైటిల్ ని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఒకేసారి 5 భాషల టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు సుకుమార్ టీం. అలాగే  ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నారు అన్న విషయం ఎక్కడ బయటికి రాలేదు. కానీ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరిలో రూపుదిద్దుతున్నారని తెలియజేయడం జరిగింది.

 


ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ కన్నడ, మలయాళం, తమిళం భాషలలో విడుదల చేస్తామని సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని అఫీషియల్ గా అందరికీ తెలియ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఇది నిజంగా అల్లు అర్జున్ ఫాన్స్ కు, ప్రేక్షకులకు అందరికీ కూడా సప్రైజ్ గా  నిలిచింది. అలాగే ఫాన్స్ ఇంత త్వరగా అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలోకి వస్తాడని అనుకోలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

 


మన తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమా #RRR ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలతో ముందుకు కొనసాగుతోంది. సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి అలాగే సినీ వర్గాల నుంచి భారీ అంచనాలు పెరిగిపోయాయని అర్థమవుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ గా రామ్ చరణ్ రామరాజు ఫర్ బీమ్ అంటూ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని తెలుగు ఇండస్ట్రీలో సమాచారం.

 


ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ అనుగుణంగా సుకుమార్ రాజమౌళికి గట్టిపోటీ ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు తెరకు ఎక్కుతూ ఉండడంతో హాట్ టాపిక్ గా మారింది సినీ ఇండస్ట్రీలో. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మాత్రం పుష్ప సినిమా గట్టిపోటీ ఇస్తుందన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలకు సిద్దమవుతాయేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: