రాఘవ లారెన్స్... డ్యాన్స్ మాస్టర్ గా, నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే లారెన్స్ మరోసారి కరోనాపై పోరుకు 3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. టాలీవుడ్ లో, కోలీవుడ్ లో లారెన్స్ చేసిన సాయం గురించే భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. కరోనా బాధితులకు లారెన్స్ చేసిన సాయం సంచలనంగా మారుతోంది.
లారెన్స్ చేసిన సాయం తెలిసి నెటిజన్లు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలు సిగ్గు తెచ్చుకోవాలి అని కామెంట్లు తెచ్చుకున్నారు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకునే హీరోలు కరోనా బాధితులకు సాయంగా కోటి రూపాయలకు అటూఇటుగా మాత్రమే ప్రకటించారు. లారెన్స్ ఒక సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని సహాయంగా ప్రకటించాడు. తాను సంపాదించిన దానిలో చాలా వరకు ఛారిటీలకే ఇస్తున్న లారెన్స్ 3 కోట్ల రూపాయలు సహాయం చేశాడని తెలిసి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
తాజాగా సన్ పిక్చర్స్ సంస్థ తీయబోయే సినిమాకు అడ్వాన్స్ గా మూడు కోట్ల రూపాయలు లారెన్స్ కు ఇచ్చింది. మూడు కోట్ల రూపాయలలో లారెన్స్ సొంత గ్రామానికి 75 లక్షల రూపాయలు, వికలాంగులకు 25 లక్షల రూపాయలు, సినిమా కార్మికులకు 50 లక్షలు, డ్యాన్సర్స్ అసోసియేషన్ కు 50 లక్షలు, పీఎం సహాయనిధికి 50 లక్షలు, తమిళనాడు సీఎం సహాయనిధికి 50 లక్షలు ఇచ్చారు.
లారెన్స్ చేసిన సహాయం ఒక రకంగా స్టార్ హీరోలను కూడా షాక్ కు గురి చేస్తుందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా కరోనా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతూ ఉంది. ఇలాంటి సమయంలో కార్పొరేట్ సంస్థల, ప్రముఖుల విరాళాలు ప్రభుత్వానికి ఎంతో అవసరం. 3 కోట్ల రూపాయల సాయం ప్రకటించి గొప్ప మనసును చాటుకున్న లారెన్స్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.