లాక్ డౌన్ వేళ బాలీవుడ్ తారలు ఏం చేస్తున్నారంటే..?
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత దేశాన్ని కూడా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కేవలం అత్యవసర సేవలను మాత్రమే అందుబాటులో ఉంచిన కేంద్ర ప్రభుత్వం మిగతా అన్ని సేవలను మూసివేసింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అటు చిత్ర పరిశ్రమలో కూడా ఒక్కసారిగా షట్ డౌన్ అయిపోయింది. దీంతో చిన్న హీరోలతో సినిమాల నుండి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని సినిమా షూటింగులు ఆగిపోయాయి. ఇక ఈ సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సినీ స్టార్స్ అందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన చాలా మంది సినీ తారలు ఇంటి దగ్గర గడిపే సమయాన్ని పలురకాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే చాలా మంది బాలీవుడ్ లాక్ డౌన్ సమయంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నారు. మాములు గానే బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ సిక్స్ ప్యాక్ తో దర్శనమిస్తారు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు వారి ఫిట్నెస్ మరింత పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్... బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బిజీ బి గా పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఫైట్ అయిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో... వ్యాయామం చేస్తూ సమయం గడుపుతారు. ఎప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే అమితాబచ్చన్ ప్రస్తుతం సమయం దొరకడం తో ఆరోగ్యంపై దృష్టి పెట్టారు.
అయితే లాక్ డౌన్ నేపథ్యంలో యువహీరో విక్కీ కౌశల్ కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఆమ్లెట్ క్లిప్పింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ఇల్లును క్లీన్ చేసుకుంటున్నాడు. అలాగే ఫిట్నెస్పైనే ఎక్కువ దృష్టి పెట్టారు విక్కీ కౌశల్. లాక్ డౌన్ దొరికిన సమయాన్ని ఫిట్నెస్ కోసం ఉపయోగించూకుంటున్నాడు విక్కీ కౌశల్. అయితే సినీ తారలు చాలా మంది ట్రైనర్ లేకపోతే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడరు. కానీ అనిల్ కపూర్ మాత్రం ట్రైనర్ లేక పోయినప్పటికీ... వ్యాయామం చేస్తూ ఫిట్నెస్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. చాలామంది జిమ్ కి వెళ్ళకుండా హోమ్ జిమ్ లోనే సమయం గడుపుతూ ఫిట్నెస్ మంత్రాన్ని పాటిస్తున్నారు.