స్టార్ హీరోతో సినిమా అంటే చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. కాంబినేషన్ నుంచి మొదలుపెడితే.. బిజినెస్ లెక్కల వరకు బోల్డన్ని ఆలోచిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇలాంటి లెక్కలతో పనిలేకుండా సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ పట్టించుకోకుండా, సినిమాలకు సైన్ చేస్తున్నాడు పవన్.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. పవర్ స్టార్ ఇమేజ్ ని మేచ్ చేసే దర్శకుడిని వెతకడానికి బోల్డంత టైమ్ ఖర్చు చేస్తారు నిర్మాతలు. కానీ సుజిత్ కు మాత్రం ఈ అవకాశం కొంచెం ఈజీగానే దొరుకుతుందని చెబుతున్నారు సినీ జనాలు. సాహోతో అంతగా మెప్పించలేకపోయిన సుజిత్ కు పవర్ ప్రాజెక్ట్ దొరికిందనే టాక్ వస్తోంది.
రన్ రాజా రన్ తో యూత్ ను మెప్పించిన సుజిత్, సెకండ్ సినిమాతో ప్రభాస్ ను డైరెక్ట్ చేశాడు. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో సాహో తీశాడు. వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ సినిమా యాక్షన్ లో అదరగొట్టినా.. ఆడియన్స్ ను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. డార్లింగ్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. అయితే ఈ ఫెయిల్యూర్ లో ఉన్న సుజిత్ కు మెగా ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
మళయాళంలో సూపర్ హిట్ అయిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ సినిమాను తెలుగులో తీయాలనుకుంటున్నాడు చిరంజీవి. సైరా టైమ్ లోనే ఈ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఇక ఈ మళయాళీ కథను తెలుగీకరించి బాధ్యతను సుజిత్ కు అప్పగించిందట కొణిదెల కాంపౌండ్.
చిరంజీవి రీసెంట్ గా లూసిఫర్ రీమేక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ రీమేక్ లో హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓకే చెబితే తమ్ముడితో అయినా తీస్తాం. పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి, తమ్ముడైతే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఈ యాంగిల్ లో కూడా ఆలోచిస్తామని చెప్పాడు. ఒకవేళ పవన్ ఒప్పుకుంటే సుజిత్ పంట పండినట్టే అని చెప్పుకోవచ్చు.